అచ్చతెలుగు ఆవకాయ బిర్యానీ
ఆవకాయకు, బిర్యానికి అసలు సంబందమేలేదు. కాని మేం అవకాయ బిర్యాని అనేశా. దీనికి తోడు అచ్చ తెలుగు కలిపాం. అవకాయ అంటేనే తెలుగు వారి నోరూరించే పచ్చడని ప్రపంచం మొత్తం తెలుసు. దీనికి అచ్చతెలుగు అని అనడమేంటీ ? అనేగా మీ ప్రశ్న. అక్కడికే వస్తున్నాం. శేఖర్ కమ్ముల అదేనండి ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్ వంటి స్వచ్చమైన తెలుగు సినిమాలను తీశాడే అయనే. ఆయన నిర్మాతగా తన శిష్యుడైన అనీష్ దర్శకత్వంలో ఆవకాయ బిర్యాని అనే సినిమాను తీస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయినట్లే. ఈ చిత్రంలో అంతా కొత్త నటులే. అయితే ప్రధాన నటి పాత్రకు ఇటీవల కాలంలో వెలుగు చూస్తున్న పరభాషా భామలను కాకుండా అచ్చ తెలుగు అమ్మాయైన బిందును శేఖర్ పరిచయం చేస్తుండటమే ఈ అచ్చతెలుగు ఆవకాయకు పూర్తి అర్థం.
తెలుగుదనపు తియ్యదనాన్ని తన సినిమాల ద్వారా చూపించే శేఖర్ నిర్మాతగా కూడా తన ఆవకాయ బిర్యాని చిత్రంలో తెలుగు అమ్మాయినే పరిచయం పరిశ్రమలోని పెద్దల అభినందనలు అందుకుంటుంది. ఇదిలా వుండగా ఇటీవల కాలంలో పరభాషా నటీమణులకు నిర్మాత, దర్శకులు పెద్దపెట వేస్తుండగా తిరుపతికి చెందిన బిందు అవకాయ బిర్యాని లో ఎంపిక కావటం తెలుగు సినీ పరిశ్రమలో శుభపరిణామంగా చెప్పొచ్చు.
బిందును శేఖర్ టలెంట్ సెర్చ్ లో చూసి తన సినిమాలో అవకాశం ఇచ్చారు. శేఖర్ సినిమాలలో హీరోయిన్ గా పరిచయమయ్యే నటులకు ఒక్కసారిగా పరిశ్రమలో గుర్తిపు లభించటం జరుగుతూ వచ్చింది. ఈ వరుసలో అనంద్ ద్వారా రాజా, కమలిని ముఖర్జీ, హ్యాపీడేస్ ద్వారా తమన్నతోపాటు యువ తారలు బిజీగా పలు చిత్రాల్లో నటిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇప్పుడు అచ్చ తెలుగు బిందు సినీ అవకాశాల అహ్వానంలో ముందుకు సాగుతుంది. ఎలాగైతేనెం శేఖర్ కమ్ముల ద్వారా ఓ అచ్చ తెలుగు అమ్మాయి తెలుగు పరిశ్రమ దొరకటం నిజంగా శుభ పరిణామమే.
<< Home