Wednesday, June 3, 2009

అందరిలో నేను...


ఎందరో మహానుబావులు అందరికి వందనాలు. అందరూ చల్లగా ఉండాలని కొరుకునే కొంతమందిలో నేనున్నానని అనుకుంటునందుకు మరోమారు కృతజ్ఞతలు. సరే అంద్ర దేశంలో ఎండలెలా ఉన్నాయ్ అని అడిగేకంటే రాజకీయాలెలా అని అడగటం మంచిదేమో. వాటివల్ల మనకేమైన వచ్చేదేముందని అంటారా. ఉందనే ఆశొకటి.అదేమంటే కెంద్రంలో కూడా ఒకే ప్రభుత్వం కాబట్టి ఈ సారైనా మన రాష్ట్రానికి ప్రాధాన్యత పెరిగి వృద్ది సాధిస్తుందనె ఆశ. ఎందుకంటే మనవంతుగా మన రాష్టం కొద్దిగైన ఆలోచించాలిగా.. చూశారా.. ఆలోచించే వారిలో నెనున్నానని..


మేఘన గుండ్ల

Friday, May 22, 2009

చక్కటి ప్రేమకు...


కొన్ని... నాకు నచ్చినవి...?
















Friday, April 24, 2009

అబ్బో.. చానాళ్లకు కలుస్తున్నా..







అవును.. ఈ మద్య చాలా బిజీ అయ్యా.. ఎందుకంటే ఎలక్షన్ కదా. మా డూటీఐ తప్పవుకదా. అందుకే బ్లాగువైపు కూడా చూసే వీలులేకపోతుంది. ఇప్పుడు కూడా చాలా రోజులు అయ్యిందిగా అందుకే పలకరించి పోదామని వచ్చి.. మళ్లీ కలుస్తా.. అందాక సెలవ్..

మేఘన గుండ్ల

Friday, March 27, 2009

విరోధి నామ సంవత్సరాధి శుభాకాంక్షలు




అఖిలాంధ్ర తెలుగు, కన్నడ ప్రజలకు విరోధి నామ శుభాకాంక్షలు తెలుపుతుంది. మీకు.. మీ కుటుంభానికి సకల, సౌభాగ్యాలు, ఆయురారోగ్యాలు చేకూరలని ఆకాంక్షిస్తున్నాం
మేఘన గుండ్ల

Monday, February 23, 2009

జై హో...


యాస్ ఏ తమిళన్.. బీ ప్రౌడ్ టు ఏ ఇండియన్. అన్నాడు నటుడు కమలహాసన్. ఆస్కార్ అవార్డ్ తీసుకున్న మొట్ట మొదటి భారతీయుడు ఏఆర్ రహమాన్ కు అభినందల వెల్లువలో వచ్చిన ఓ కాంప్లిమెంట్. నిజమే వంద కోట్ల భారతీయుల కల నిజం చేసిన రహమాన్ కు మనమథ 'జై హో' చెప్పాల్సిందే. జై హో భారత్. జై హో రహమాన్.


మేఘన సంజయ్

Wednesday, January 28, 2009

కుమ్ములాటలో తెలుగు 'పాత్రికేయం'







వాస్తవాలను వెలికితీయటంలో ప్రసార సాధనాల పాత్ర అమోఘం. కానీ.. తెలుగు ప్రసార సాధనాలను చూస్తుంటే వ్యాపారాపేక్షతో కుమ్ములాటలే అధికంగా కనిపిస్తున్నాయి. ఒకరిపై మరొకరు.. తిట్ల దండకానికే అధిక ప్రాధాన్యతను కల్పిస్తూ వాస్తవాలు మరుగున పడిపోయేందుకు కారకులవుతున్నారు. ఎందుకీ రచ్చ. కుమ్ములాటలు వదిలి వాస్తవాలను అందిస్తే సరిపోతోంది కదా. ఓ తెలుగు ప్రసార పాత్రికేయమా ఇప్పటికైనా మీ వ్యాపార లబ్ధిని పక్కనపెట్టి జనజీవానానికి పనికివచ్చే వార్తలను అందించటంలో కాస్తంత దృష్టి సారించండి. లేకుంటే మీ వైపు చూసేందుకు కూడా ఔత్స్తాహికులు ఆసక్తి చూపరు.

మేఘనరావ్ గుండ్ల