Thursday, September 25, 2008

హాయ్.. నే బాగున్నా.. మరి నువ్వో..


నీ గురించి నాకెందుకయ్యా. ఎదో నేను బాగున్నా కదా అందుకే మాట వరసకు అలా అడిగా అంతే. ఇటీవల నా "మనసు"గాడు చుట్టూ ఉన్న నా స్నేహితుల వైఖరిపై ఇలా స్పందిస్తున్నాడు. అదే విషయాన్ని పలుమార్లు నెమరువేసుకుంటున్నా అంతుచిక్కనిదెమిటంటే.. వాళ్ళెందుకలా ఆలొచిస్తున్నారనే. చివరకు తెలిసిందేమిటంటే జీవన పోరాటంలో ఇవన్నీ అందరికి సహజమే. వయటపడరు. అయినా వారిగురించి నాకెందుకు. అందుకే నా వరకైతే నేను బాగున్నా.. మీరు బాగుండాలి.. నాకు నచ్చింది ఉభయకుశులోపరి. నేనిలాగే.. ఇంతటితో "మనసు"గాడి ఆలోచనకు పుల్ స్టాప్ పెట్టా.

మేఘన గుండ్ల



Tuesday, September 23, 2008

కళ్ళు తెరిచిన దేవుడు..!




మేఘన గుండ్ల

Thursday, September 18, 2008

అందరూ అలాగే... బయటపడరు..!






అవును.. అందరూ అలాగే ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బయట పడరూ అంటూ దూరం నుంచి వచ్చిన మా ప్రెండ్ కూర్చుంటూ అన్నాడు. వడెప్పుడూ ఇంతే ఏదో ఒక టాపికోనే నా వద్దకు వస్తాడు. రాగనే ఇదిగో కూర్చొక ముందే నస మొదలు పెడతాడు. కొన్ని సందర్బాలలో నాకు వాడు చెప్పేది అర్థమైనా రోజూ ఎక్కడో ఒక చోట నిత్య జీవితంలో ఎదురు చూసే సంఘటనే కదా అనుకుంటూ వాడి వద్ద వాదించను.



కానీ ఈరోజు వాడు తెచ్చిన ప్రస్తావన కొంచం విచిత్రంగా అనిపించింది. అదేంటంటే ప్రతి మనిషిలోనూ స్వార్థం ఉందనటం. నేను అలా ఒప్పుకోనని వాదించా. వెంటనే వాడు "ఎప్పుడైన మనలోని నిజాన్ని బహిరంగంగా కాకపొయినా వ్యక్తిగతంగానైనా అంగీకరించగలిగితే నిజంగా మనకంటే మహాపురుషుడు ఉండడు" అన్నాడు. అలా అని వెంటనే ప్రతి మనిషి అశాజీవే.. ప్రతి వ్యక్తి ఏదో తెలియని ఆరటంలో నిత్యం పొరాడుతూనే ఉంటాడు. అందులోనే స్వార్థం దాగివుంది. బార్య భర్తల నడుమ, తల్లిదండ్రుల నడూమ, పిల్లల నడుమ, డబ్బు విషయంలో, ఉద్యోగ విషయంలో, కొనుగొల్లు, విక్రయాలు, అవినాభావ సంబంధాలు, ఈగోలు, స్నేహ బంధాలు, ప్రేమలు, నిరాశ, నిస్పృహలు, సత్సంబంధాలు, కన్నీటి కథలు, సినిమాలు, ఆనందాలు... ఇలా ఏదో ఒక విషయంలో మనిషి రోజూ తన స్వార్థాన్ని తనలోనే నీవురుగప్పిన నిప్పులా పెంచి పోషిస్తున్నాడు. కాని ఎవ్వరూ బయట పడరు. ఇది వాడు నాకు ఉపదేశించిన జీవితసారం.



చివరకు ఒప్పుకున్నాను.. వెంటనే చూశావా ఇదీ స్వార్థమే అన్నాడు. ఎలారా అంటే... నేను అనే అహం మనలో ఉందందంటేనే అది స్వార్థం అవుతుంది. ప్రతి వ్యక్తి ఇదే తరహాలో నేనున్నాను అనే వాదనలొ జీవిస్తాడు. కాని అదంతా తనకోసమే చెసుకుంటున్నాడనేది అంగీకరించడు. అందరూ అలాగే. కానీ బయటపడరు. ఈ బయట పడని వారిలో నేనున్నా. నీవున్నావు. అందరూ ఉన్నారు. లేదు నేను స్వార్థ పరుడిని కాదు అనే మనిషున్నాడంటే అది అతని అహానికి పరాకాష్టే అవుతుంది అని ఓ చిన్న నవ్వు నవ్వి వెళుతూ మనం స్వార్థ పరులం.. మనకోసం మనం జీవించటంలో. దీనిని అంగీకరించం. అందరూ అలాగే బయట పడరు అంటూ రేపొస్తా బై అన్నాడు. ఈ విషయం అలోచిస్తూ.. మళ్ళి వాడొచ్చేంతవరకు కొన్ని వాస్తవాలను నెమరు వేసుకుంటున్నా...



మేఘన గుండ్ల

Monday, September 15, 2008

కొన్ని సార్లు...


అలాగే జరుగుతాయి... ఎంటనుకుంటున్నారా?. కొన్ని సంఘటనలు కొన్ని సార్లు మనకు తెలియకుండానే అలా జరుగుతుంటాయి. యాదృచ్చికంగా జరిగేవి కొన్నైతే మన తైం బాలోలేక కొన్ని. ఏదైతేనేం కొన్ని అలాగలగే జరుగుతుంటాయని ఇటీవల ఓ సంఘటన నాకు తారసపడింది.


అదేంటంటే...


రోజులాగే నేను ఆపీస్ కు బయలు దేరా. అర్జంటుగా రమ్మని మా సీనియర్ పొన్ చేయటంతో బండిలోనే కదా పది నిమిషాల్లో వెల్లొచ్చని పది బలుదేరందుకు పది నిమిషాల ముందు వరకు ఇంటి వద్దే ఉన్నా. తీరా బయలు దేరే సమయానికి బండి వద్దకు వచ్చి చూస్తే గుండె గుటుక్కుమంది. కరణం వెనుక టైరు గాలిలేకపొవటమే. ఆపీస్ నుంచి నిమిషానికొ పొన్. ఇదో పక్కనే ఉన్నా అనేది నా సమాధానం. చూస్తే బంది ఇలా హ్యండిచ్చింది ఎం చేయాని ఆటోను ఆశ్రయిద్దామని స్టాండ్కు వచ్చా చేసేది లేక వాడు అదిగినంతా ఇస్తానన్నా. వాడు సంతోషంగా గెంతేసి జుమ్మంటూ ఆటో తీశాదు. ఇదిగో నేను ముందు చెప్పానే టైం ఇక్కడ కూడ మొకాళ్ళు అడ్డేసింది. ఓ కిలోమీతర్ వెళ్ళిందో లేదో నిలిచిపోయింది. అప్పటికే నేను అనుకున్న పది నిమిషాలు చాల్లగా అయిపోయాయి. ఇక నాకు చమటలు మిగిలాయి. ఆటోవాన్ని, నా బండిని చేసేదేంలేక మనసుల్లోనే తిట్టుకుంటూ మరో ఆటో కోసం ప్రయత్నించా. కాని అంతా తెలిగా దొరుకుతుందా... అదీ చెన్నై లో. ఇకా కాళ్ళకు పని చెపుతూ పరుగున ఆపీస్ కు వచ్చే సరికి పుణ్యకాలం పూర్తయ్యింది. టైం కు వచ్చిన మా సీఈఓకు నేనంటే కాస్త అభిమానం ఉండటంతో చివాట్లు పెట్టలేక నకో లెటెర్ రసి వెళ్ళి పోయాడు. ఆ లెటెర్ లోని నీయి సూత్రమేమిటంటే వెళ్ళాలనుకునే ప్రాంతానికి పది నిమిషాలు ముందే వెళ్ళు. అప్పుడే నీవంటే పక్కనోళ్ళకు గౌరవం పెరుగుతుంది.


ఔను... కొన్ని సంఘటనలు మంచి పాఠన్ని నేర్పుతాయి. నేను నేర్చుకున్నాను. అందుకే కొన్ని సార్లు మనమంచి కోసం కొన్ని అలా జరుగుతుంటాయి.



మేఘన గుండ్ల

Tuesday, September 9, 2008

తబు (టబు)... ఓ మంచి నటి!



ఔను.. నేనైతే టబు మంచి నటి అనే అంటాను. మామూలుగా కాదు.. జాతీయస్థాయి నటిగా నేను అంగీకరిస్తాను. సోదరి ఫరా అంతకుముందే నటిగా బాలివుడ్ కు సుపరిచితం కావటం. అమె ద్వారా టబు "కూలీ నెంబర్ 1" చిత్రంలో తెలుగు తెరకు దర్శనమిచ్చిన దగ్గర నుండి అమెను చూసిన వారంతా మంచి అందాల నటి వెలుగు చూసిందనే అన్నారు. ఆరంభ కాలంలో కాస్తంతా గ్లామర్ తారగా అగుపించినా అనంతరం తనలోని నట విశ్వరూపాన్ని బాలివుడ్ వరకు తెలుసుకునేల చేసింది. అమెలోని నటిని ఒక్క "మాచీస్" చిత్రం ద్వారా చూడొచ్చు. ఆ చిత్రమే అమెను జాతేయ ఉత్తమ నటిగా నిలబెట్టింది. తదనంతరం ఎన్నో సినిమాల్లో ఆమె చేసిన పాత్రలు సామాన్య, మద్య తరగతి ప్రజానికానికి చేరువయ్యేలా చేసింది.

నిన్నే పెళ్ళాడుతా. నాగార్జునకు జంటగా టబు చేసిన సినిమా. ఈ చిత్ర ఘన విజయం ఇటు కోలీవుడ్, అటు టాలివుడ్ లోనూ విజయాల తారగా వెలుగు చూసేందుకు దారిని చేసుకుంది. తను చేసే ప్రతి చిత్రంలోనూ వైవిధ్యాన్ని చూపే టబును దర్శకులు కూడా నటనకు ఆస్కారమున్న చిత్రాలకే అహ్వానం పలికారు. వెండితెరంగెట్రం చేసి సుమారు 20 ఏళ్లు కావస్తున్నా ఇంకా వన్నె తరగని మంచి నటిగా బాలివుడ్ ను ఏళుతున్న టబు నిజంగా జాతీయ ఉత్తమ తారే. అందుకే నాకు నచ్చిన నటీమణుల్లో టబుకు ఓ ఓటేస్తా.

మేఘన గుండ్ల

Thursday, September 4, 2008

మన్మధ "కింగ్"


నాగార్జున నటిస్తున్న "కింగ్"లో ఇదో ఇలా కనిపిస్తారు. ఈ స్టిల్ చూస్తుంటే ఆమధ్య కాలంలో వచ్చిన మన్మధుడు సినిమా గుర్తుకు వస్తున్నాడు కదా..!. ఒకవైపు కింగ్ టైటిల్. మరోవైపు మన్మధుడి గెటప్... కొంచం ఆలోచించాల్సిందే. అయితే మాస్.. మసాలా.. యాక్షన్ తరహాలో ఉన్న కింగ్ పేరుకు ఇక్కడ చూస్తున్న స్టిల్ కు సంభందముందనే దర్శకుడు చెపుతున్నాడు. అసలా కథేమితో తెలుసుకోవాలంటే కింగ్ విడుదల వర్కు ఆగాల్సిందే. ఏదేమైనా 50వ వడిలో పడిన నాగార్జున ఈ స్టిల్ లో చూస్తుంటే ఇంకా మన్మధుడిగానే కనిపిస్తున్నడు కదా..!. అందుకే నాగార్జున ప్రస్తుతం మన్మధ కింగ్ అని పిల్చుకోవాల్సిందే.


మేఘన గుండ్ల

వన్నె తరగని "మల్లెపువ్వు"



ఎంతటి మందార మకరందాన్ని చిందించే పువ్వులైనా కొంతకాలానికి వన్నె తగ్గటం సృష్టి రహస్యమే. అదేవిధంగా సినివినీలాకాశంలో ఎంతటి సుకుమారైన కొన్ని సినిమాల తర్వాత లేక వారి వివాహమైతే తిరిగి అంతటి చంధస్సులో కనిపించటం అరుదే. తారలుగా ఓ వెలుగువెలిగి వివాహానంతరం తల్లిగానో, చెల్లిగానో తెరపై కనిపించే నేటి తరుణంలో వివాహం ముందు తర్వాత ఎప్పుడైనా సరే నేను ఇలాగే నా మేని వర్చస్సుతో వెలిగుతూనే ఉంటానని నిరూపిస్తున్న తార భూమిక.


యువకుడు చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన భూమిక చేసింది కొన్ని చిత్రాలైన అన్ని విజయవంతమైన పాత్రల్లోనే కనిపించింది. యువ హీరోల నుండి అగ్ర తారల వరకు జోడీ కట్టిన భూమిక అటు తమిళంలోనూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది. అంతేకాకుండా బాలివుడ్ లోనూ జయకేతనం ఎగురవేసిన భూమికా దక్షిణాధికి దొరికిన నటీమణుల్లో ఓ ఉత్తమ నటిగా తన స్థానాన్ని నిలిపింది.


గత యేడాదే యోగా గురువైన భరత్ ఠాగూర్ ను ప్రేమ వివాహం చేసుకున్న భూమిక సినిమాలకు పుల్ స్టాప్ పెడుతుందని అంతా అనుకున్నారు. కాని భర్త అంగీరం, వన్నె తరగని తన మేనితో సెలెచ్టెడ్ సినిమాల్లో నటించేందుకు ముందుకు వచ్చింది. వివాహం తర్వాత కూడా హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉండటమే ఇంతటి ఉపోద్ఘాతానికి కారణం.


కొత్త హీరోకు జంటగా భూమిక నటిస్తున్న "మల్లెపువ్వు" త్వరలో విడుదలకు సిద్దమవుతుండగా, ఈ చిత్రంలోని స్టిల్ల్స్ చూసిన వారంతా అమె అందానికి ముగ్దులవుతున్నారు. ఇదిలా ఉండగా యువ హీరో నవదీప్ తో ఓ చిత్రంలో నటిస్తుండగా పెరు పెట్టని మరో రెండు చిత్రాల్లో నటిస్తోంది. దీనికి తోడు తమిళంలో శ్రీరాం కి జోడిగా నటిస్తున్న "మా" ఇటీవలే ప్రారంభమైంది. ఇటు తెలుగు, అటు తమిళ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ముందుకు సాగుతున్న ఈ వన్నె తరగని మల్లెపువ్వు భూమికను అభినందించాల్సిందే


మేఘన గుండ్ల

నాలుగు సినిమాలాట






ఈ మధ్య విడుదలైన కొన్ని చిన్న సినిమాలు నిర్మాతలను గట్టెక్కించటమే కాకుండా వటిల్లో నటించిన వారికి కొంచం పేరు కూడా తెచ్చిపెట్టాయి. దీంతో చిన్న సినిమాల సీజన్ ప్రారంభమైంది. తెలుగు సినీ పరిశ్రమ చిన్న సినిమాల విజయాలతో కాస్త ఊపిరి పీల్చుకుంటుండటంతో ఇదే శుభతరుణంగా భావించిన పలువురు చిన్న నిర్మాతలు తమ చిత్రాలను విడుదల చేసేందుకు సిద్దమయ్యారు. ఈ వరుసలోనే ఈవారం ఏకంగా నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయి.



అష్టా చెమ్మా



గ్రహణం చిత్రం ద్వారా ఉత్తమ చిత్ర దర్శకుడిగా మన్ననలు పొందిన మోహనకృష్ణ ఇంద్రగంటి రూపొందించిన చిత్రమిది. ఇందులో మా టీవీలో కలర్స్ ప్రోగ్రాం ద్వారా సుపరిచితమైన స్వాతి హీరోయిన్ గా, కొత్త కుర్రాడు నాని హీరోగా నటించారు. పూర్తి స్థాయి అహ్లాదం ఈ చిత్రంలో ఉంటుందని అందుకే అష్టా చెమ్మా అనే పేరుపెట్టినట్లు దర్శకుడు అన్నారు. అన్నట్లు స్వాతి ఈ మద్య కాలంలో తమిళంలో నటించిన "సుబ్రమణ్యపురం" తమిళ నాట భారి విజయాన్నే నమోదు చేసుకుండి. అంతేకాదు ఈ చిత్రంలోని "కంగళిరుందాళ్..." అనే పాట కుర్రకారు గిలిగింతలు పెట్టి ప్రస్తుతం ఎవరివద్ద చూసిన ఈ పాటే రింగ్ టోనై కూర్చుంది. అంతేకాదు తమిళ యువత మదిలో స్వాతి కిరణం అయ్యింది.



బ్యాంక్



కొంతకాలంగా విడుదలకు నోచుకోక ఎట్టకేలకు విముక్తి పొందుతున్న చిత్రం బ్యాంక్. ఇప్పటికే ఈ చిత్రం విడుదలను పలుమార్లు ప్రకటించి వెనక్కు తగ్గిన నిర్మాతలు చివరిగా ఈ శుక్రవారం తాడోపేడోకు సిద్దమయ్యారు. ఇక ఈ చిత్రంలో బాలివుడ్ నటుడు జాకీష్రాప్, అబ్బస్, అర్చన(వేద) నటించగా దివంగత రఘువరన్ ప్రధాన భూమికను పోషించిన చివరి చిత్రం ఇదే.



అంకిత్ పల్లవి అండ్ ప్రెండ్స్



హ్యాపీడేస్ చిత్రం ద్వారా పరిచయమైన అఖిల్, కొత్త తార అక్ష, హరి ఎల్లెటి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. కాలేగ్ వయస్సులో యువతలోని భావాలకు అనుగునంగా ఈ చిత్రం ఉంటుందని నిర్మాతలు ప్రారంభం నాడే చెప్పారు. శిక్రవారం విడుదలవుతిన్న ఈ చిత్రం ఆడియోకు మంచి స్పందనే రావటంతో సినిమా కూడ విజయం సాధిస్తుందనే ఆకాంక్షను చిత్ర యూనిట్ వెలిబుచ్చారు.



స-రో-



తమిళ్ లో చెన్నై-28 వంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన చిత్రం స-రో-జ. నలుగురు కుర్రాళ్ల జీవితంలో ఒక రోజు చోటు చేసుకున్న సంఘటన ఆదారంగా తెరక్కెక్కిన సినిమా ఇది. ఇందులో శ్రీ హరి ప్రధాన భూమికను పోషించగా ప్రముఖ దర్శకుడు కోదండ రామిరెడి కుమారుడైన వైభవ్ హెరోగా, కాజల్ హీరోయిన్ గా, ఎస్పీ చరణ్, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ చిత్రాన్ని పిరమిడ్ సాయిమిర ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తోంది.



మేఘన గుండ్ల

రెండో ఇన్నింగ్స్ లో జేడీ సక్సెస్...!



శివ చిత్రం ద్వారా రాం గోపాల్ వర్మ పరిచయం చేసిన నటుల్లో జేడి చక్రవర్తి(గడ్డం చక్రవర్తి) ఒకరు. శివ తర్వాత చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక పంధాను ఏర్పర్చుకున్న జేడి ఈ మద్య కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే తిరిగి దుబాయ్ శీను చిత్రం ద్వారా నటుడిగా కనిపించిన చక్రీ నటనకంటే తన గురువైన రాం గోపాల్ వర్మ పంధాలో దర్శకుడు కావాలనే కలను నిజం చేసుకునే ప్రయత్నంలో పడ్డారు. ఇందులో బాగంగానే ఈ మద్య జగపతిబాబును నటించిన "హోమం" ద్వారా చక్రీ దర్శకుడయ్యారు. ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా చక్రీ మంచి మార్కులే కొట్టెశాడని కోలివుడ్ నుంచి వచ్చిన ప్రశంస.


ఆరంభ కాలంలో నటుడిగా మంచి క్రేజ్ ను ఏర్పర్చుకున్న జేడీ అసలు కల దర్శకుడవటమే. అయితే ఎలాగో హోమం ద్వారా మంచి మార్కులే వచ్చిన చక్రీకి ఇప్పుడు దర్శకత్వంకంటే నటనావకాశాలు కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్నాయి. అందునా తమిళ్లో అయితే ఏకంగా రజనీకాంత్ చిత్రంలో విలన్ గా నటీంచే అవకాశం వచ్చింది. హోమం చిత్రం చూసిన దర్శకుడు శంకర్ చక్రీని తమ రోబొలో విలన్ గా నటించాలని పట్టుబట్టారు. దీనికి ముందే సర్వం అనే చిత్రంలో విలన్ గా నటించేందుకు అంగీకరించిన చక్రీ కొత్తగా రోబోతోపాటు మరికొన్ని చిత్రాలలో నటించేందుకు అంగీకరించినట్లు తెలిసింది.


దర్శకుడిగా కెరీర్ ను పెంచుకుందామని ప్రయత్నిస్తున్న చక్రీకి నటనావకాశాలు వెల్లువెత్తుతుండటంతో ఆయన రెండవ ఇన్నింగ్స్ విజయపధాన్నే వరిస్తుందని చెప్పొచ్చు. రాం గోపాల్ వర్మ శిష్యుడిగానే సుపరిచితమైన చక్రీ ఏకంగా ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం చిత్రంలో నటించటం ద్వారా జాతీయ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా సత్య ద్వారా బాలివుడ్ చిత్రసీమలో తనకంటూ గుర్తింపుతెచ్చుకున్న చక్రీ మంచి నటనకు అవకాశమున్న పత్రల్లను ఎంపిక చేసుకుంటూ తన కెరీర్ ను విజయపధంలోకి తెసుకెళుతుండటం అభినందించదగ్గ విషయం.


మేఘన గుండ్ల

Tuesday, September 2, 2008

ఓం ఓం గణపతి...





శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం... అంటూ వక్రతుండుడైన విఘ్న రాజ వినాయకుడిని మొక్కందే ఏ రోజు ప్రారంభం కాదు. ముందు ఆయనకు పూజ చేసిన తర్వాతే మిగిలిన దేవుళ్లకు. అలా శాశించింది కూడా పరమేశ్వరుడే. అందుకే ఎంతటి వారైన సరే ముందుగా విఘ్నేశ్వరున్ని తలంచుకుని తమ విఘ్నాలన్ని తొలగిపొయ్యి అంతా శుభం జరగాలని కోరుకుంటారు. అంతేకాదు భారతీయ సంసృతి, సాంప్రదాయాల్లో, ఆచార, వ్యవహారాల్లో కూడా విఘ్న రాజుకు ప్రధమ నివేదనకే ప్రాధాన్యత ఇస్తారు. దీనికి తోడు భారతీయులు జరుపుకునే పండుగల్లో వినాయక చవితి (వినాయకచతుర్థి)ని మొదటి పండుగగా వ్యవరిస్తారు.


ఇందులో భాగంగానే నేడు వినాయక చతుర్థి(03.09.2009)అంటే భారతీయుల మొదటి పండుగ. నేటి నుండి దేశంలోని అన్ని ప్రాంతాలలో వినాయకుడి విగ్రహాలను కొలువుతీర్చి తొమ్మిది రోజులపాటు భక్తి శ్రద్దలతో కొలుస్తారు. హైదరాబాద్, ముంబై వంటి ప్రధాన నగరాలలో వేలాదిగా వినాయకుడి విగ్రహాలకు భారి స్థాయిలో ఏర్పాటు చేసేందుకు పోటీలు పడతారు. నవరాత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించి చివరిగా భక్తి శ్రద్దలతో నిమజ్జనం చేస్తారు.
గత ఆరు నెలల ముందు నుంచే విఘ్నేశ్వరుడు అయిన వినాయకుడి విగ్రహాలను తయారు చేయించటంలో పోటి పడిన హైదరాబాద్ నగర వాసులు తమ ప్రాతాలలో వీటిని కొలువుతీర్చేందుకు సిద్దమయ్యారు. విభిన్న అవతారాలలో దర్శనమిస్తున్న విఘ్నేశ్వరుడి రూపాలు నగరానికి కొత్త శోభను అందించనున్నయి. విగ్రహాలను ఏర్పాటు చేయనున్న ప్రాతాలకు పోలిసుల అనుమతి కూడా తీసుకోవటం జరిగింది. అదేవిధంగా పండుగ సందర్బంగా ఎటువంటి అవాంచనీయ సంగటనలు జరగకుండా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లలో పోలీసు యంత్రాంగం సిద్దంగా ఉంది. ఈ ఏదాది కేవలం హైదరాబాద్ నగరంలోనే 25 వేల విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. విగ్రాహాల ఏర్పాట్లు, నిర్వాహణ, నిమజ్జనం ద్వారా మొత్తం సుమారు 100 కోట్ల రూపాయిల మేరకు ఖర్చు కానుంది.


భక్తి శ్రద్దలతో వినాయక చతుర్థిని జరుపుకుంటున్న అఖిలాండకోటి భారతీయులకు మేఘన సంజయ్ గుండ్ల హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతోంది.

హరన్నా... నమస్తే



నందమూరి వంశంలో తండ్రి తర్వాత రాజకీయాల్లో తలపండింది హరికృష్ణ ఒక్కరే. ఎన్ టీఆర్ తెలుగుదేశం స్థాపించిన నాటినుంచి ఆయన వెంటే ఉండీ ఆయన చైతన్య రధాన్ని నడిపి రాజకీయాలను నేర్చుకున్న హరన్న(హరికృష్ణ)లో నిజంగానే మంచి నాయకుడి లక్షణాలు ఉన్నాయి. తండ్రిని పదవి నుంచి దింపిన కాలంలో చంద్రబాబు చెంతకు చేరిన హరన్న అక్కడ తన స్థానంపై అలకబూని ప్రత్యేక పార్టీని కూడ పెట్టారు. అయితే బాబు బుజ్జగించటంతో తిరిగి తెలుగుదేశంలో చేరి ప్రస్తుతం రాజ్య సభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.


తనకంటూ ఓ ప్రత్యేకత.. నిబద్దత.. పాలసీని ఏర్పర్చుకునే హరన్నకు ఎన్ టీఆర్ లాగానే వాక్చాతుర్యం ఉన్నా ఇటీవల తెలుగుదేశానికి తగులుతున్న అసమ్మతీయుల దెబ్బల వలన ఆయన పార్టీ కార్యాలయానికే పరిమితమవుతుండటం కొంత నిరాశే ఎదురవుతుంది. అయితే వచ్చే ఎన్నికల్లోగా పార్టీకి పూర్వ వైభవం తెచ్చెందుకు హరన్న తన కుంటుంభం మొత్తాన్ని తెరపైకి తీసుకు వచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు భేష్ గా ఉన్నాయి. సినిమాల్లో పవర్ పుల్ డైలాగ్స్ తో, పంచ్ లతో తనకంటూ ఇమేజ్ ను సృష్టించుకున్న హరన్న రాజకీయాల్లో కూడ విజయం సాధించాలని కోరుకుందం. ఎందుకంటే ఈ రోజు హరన్న పుట్టిన రోజు


ఈ నేపధ్యంలో జన్మదినాన్ని జరుపుకుంటున్న పవన్ కళ్యాన్ కు మేఘన గుండ్ల హృదయపూర్వక శుభాకాంక్షలు చెపుతోంది. హ్యాపీ బర్త్ డే హరన్న

Monday, September 1, 2008

హ్యపీ బర్త్ డే పవన్...





పవన్ కళ్యాన్... ఈ పేరు వినగానే యువతలో టక్కున ఓ షార్ప్ నెస్ కనిపిస్తుంది. అంతేకాదు కొత్త ప్యషన్లు... స్టైల్.. తాను ఏది చేసిన కొత్తదనాన్ని చూపటం అయనకే సాద్యం. అందుకే ఆయన పేరు వినగానే కుర్రకారు చిందేస్తారు. అయితే సినిమాలేమోగానీ అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఆవిర్బావానికి చమతోడ్చిన పవన్ కళ్యాన్ కొద్ది రోజుల విరామం తర్వాత ఇదిగో ఈరోజు పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు. విభిన్నతను కోరుకుంటూ ఆచితూచి సినిమాల్లో నటించే పవన్ ప్రస్తుతం ఎస్ జే సూర్య దర్శకత్వలో "పులి" చిత్రంలో నటిస్తున్నాడు.


అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయమైన పవన్ చేసిన ప్రతి చిత్రంలోనూ తనకంటూ ప్రత్యేకతను తెచ్చుకున్నారు. సుస్వాగతం ఆయనకు బ్రేక్ ను ఇవ్వగా తొలిప్రేమ తెలుగు చిత్రసీమలో లవర్ బాయ్ క్రేజ్ ను తెచ్చింది. తదనంతరం తమ్ముడు, భద్రి, ఖుషి చిత్రాలు పవన్ అంటే పవర్ స్టార్ అనే గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఖుషిలోని సిద్దు ఉరప్ సిద్దార్థ్ రాయ్ పాత్ర పవన్ సిని జీవితాన్ని ఓ మలుపు తిప్పింది.


ఎప్పుడూ కొత్తదనాన్ని కొరుకునే పవన్ తన ఆలోచనలను తెరకెక్కించే ప్రయత్నంలో జాని చిత్రం ద్వారా దర్శకుడి అవతారం కూడా ఎత్తారు. అయితే ఆ చిత్రం సాంకేతికంగా గుర్తింపు పొందిన ఆర్థికంగా నిరాశపరిచింది. అయినా కలత చెందకుండా వరుస చిత్రాలలో నటిస్తూ ముందుకు సాగుతున్నారు. కుషి విదుదలై ఆరేళ్ల తర్వాత ఆ చిత్ర దర్శకుడైన ఎస్ జే సూర్యాతో మరో సంచలనానికి సిద్దమయ్యారు. వీరి కాంభినేషన్ లో వస్తున్న ఈ చిత్రానికి "పులి"గ నామకరణం చేసి జోరుగా చిత్రీకరణ జరుపుతున్నారు. ఇందులో పవన్ కు జోడిగా ముంబైకి చెందిన నిఖిషాపటేల్ నటిస్తుండగా మెగా ప్రొడ్యూసర్ శింగనమల రమేష్ నిర్మాత.


నిజజీవితంలో విశాఖపట్నం కు చెందిన నందినిని వివాహం చేసుకున్న పవన్ అనంతరం వైవాహిక జీవితానికి బైబై చెప్పారు. ఇటీవలే నందినితో వివాహాన్ని రద్దు చేసుకున్న పవన్ మెగాస్టార్ ప్రజా పార్టీ పనుల్లో తలమునకలయ్యారు. నందినితో తెగదెంపులు చేసున్న పవన్ నటి (ఒకప్పుడు) రేణుడేశాయ్ తో కలిసి ఉంటున్నారు. వీరికి ఓ సంతానం కూడా ఉంది. వ్యక్తిగత జీవితాన్ని వెళ్లడించటానికి ఆసక్తి చూపించని పవన్ ప్రస్తుతం ప్రజారాజ్యం పార్టీ పనుల్లో, పులి చిత్రీకరణలోబిజీగా ఉన్నారు.


ఈ నేపధ్యంలో జన్మదినాన్ని జరుపుకుంటున్న పవన్ కళ్యాన్ కు మేఘన సంజయ్ గుండ్ల హృదయపూర్వక శుభాకాంక్షలు చెపుతోంది. హ్యాపీ బిర్త్ డే పవన్

"పదహారేళ్ల వయసు"కు 30 ఏళ్లు





ఇంతిలోని సొగసు సోయగాల చక్కిళ్ల నవ యవ్వన ప్రౌడతనాన్ని చూడాలంటే అది "పదహారేళ్ల వయసు"లోనే సాద్యమవుతుంది. ఆ వయస్సులోనే ముగ్ధమనోహర స్త్రీ తనలో దాగిన అందాల ప్రాయంలోని పాలుగారే రసజ్ణత చూపిస్తోందని కవులు, పండితులు, రచయితలు తమ బావాల్లో వ్యక్తీకరించారు. నిజమే ఆ వయస్సులోని కోరికల గుర్రాలకు కుర్రాకారు పరుగుపెట్టేది.


పదహారేళ్ల ప్రాయంలోని అందమైన ముచ్చటలు.. ఊహలు.. కలలను అంబరాన్ని తాకేల ఉర్రూతలూగించిన చిత్రమే "పదహారేళ్ల వయసు". పదహారేల్ల పడుచు ప్రాయాల యవ్వనపు రోజులను రక్తి కట్టించిన ఈ చిత్రానికి చూస్తుండగానే 30 ఏళ్లు నిండాయి. 1978 ఆగష్టు 31న విడుదలైన ఈ చిత్రానికి 30 ఏళ్లు నిండాయి. సిరిమల్లె పువ్వా... అంటూ గాయని ఎస్ జానకి గొంతులోని మాదుర్యానికి అప్పుడే 16 ఏళ్లల్లో అడుగుపెట్టిన శ్రీదేవిలోని కన్నె వయసు పరువాలకు ప్రేక్షకులు పట్టిన నీరాజనం నేటికి చెక్కు చెదరకుంటా ఆపాత మదురాన్ని తెలుగునాట గుండెల్లో దాచుకున్న ఎందరో ఉన్నారు.


రాజ్యలక్ష్మి ఆర్ట్ ఫిలింస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం వాస్తవానికి పదునారు వయదినిలే అనే తమిళ చిత్రానికి మాతృక. బారతీరాజా దర్శకత్వంలో శ్రీదేవి, కమల్ హాసన్, రజని కాంత్ నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో మిద్దే రామారావు నిర్మించారు. దర్శకుడిగా రాఘవేంద్రరావు తమిళ మాతృకలోని శ్రీదేవినే తెలుగులో కూడా నటించాలని పట్టుబట్టి మరీ చేయించారట. ఇక తెలుగు వెర్షన్ లో చంద్రమోహన్, మొహన్ బాబు నటించారు. తమిల్ చిత్రానికి ఇళయరాజ సంగీతం అందించగా తెలుగుకు చక్రవర్తి. అయితే అప్పటికే తమిళ్ లో సిరిమల్లే పువ్వా... పాట సంచలనం సృష్టించటంతో ఆ పాట ట్యూన్ అలాగే తెలుగులో వాడారు.


తమిళ్, తెలుగు భాషల్లో ఈ చిత్రం ఘన విజయం సాధించగా హిందీలో అపజయం పాలయింది. హిందీ చిత్రానికి బారతీరాజానే దర్శకత్వం వహించగా అక్కడ కూడా శ్రీదేవే హీరోయిన్. ఈ చిత్రంలో నటించినందుకు శ్రీదేవికి అప్పట్లోనే 50 వేల పారితోషికం అందించగా చంద్రమోహన్ కు 17 వేలు, మోహన్ బాబుకు 15 వేలు ఇచ్చారట. ఈ చిత్రాన్ని ఎన్ టీఆర్ కు ప్రత్యేకంగా వేసి చూపించగా ఇందులోని శ్రీదేవిని చూసిన ఆయన తన తదుపరి చిత్రమైన వేటగాడు లో హీరోయిన్ గా తీసుకున్నారు.


"పదహారేళ్ల వయసు" విడుదల తర్వాత ఇందులో నటించిన నటులందరు స్టార్స్ గా నిలదొక్కుకున్నారు. తమిళ్ లో పల్లెటూరు అమాయక పాత్రలో కమల్, పోకిరి పాత్రలో రజని, తెలుగులో పొకిరిగా మోహన్ బాబు, అమాయకుడిగా చంద్రమోహన్ ల నటన వీరంతా పెద్ద హీరోలుగా వెలుగు చూసేలా చేసింది. ఇక అందాల మల్లిగా నటించిన శ్రీదేవి ఏకంగా బాలివుడ్ లోనే తిష్టవేసి అగ్ర తారగా నిలిచింది. ఈ చిత్రం తమిళ్ లో విజయం సాధించగానే తెలుగు వెర్షన్ లో నటించేందుకు పెద్ద తారలే ముందుకు వచ్చారు. కథలో బలం, కథను నడిపించిన తీరు, తారల నటన పెద్ద హీరోలు లేకున్నా చిత్రం ఘన విజయం సాధించేందుకు కారణమైది. 1978లో విడుదలైన ఈ చిత్రం నేటికి 30 ఏళ్లు పూర్తి చేసుకుని సిందూర పువ్వా.. అంటూ పదహారేళ్ల వయసును జ్ఞాపకం చేస్తున్న శుభ సందర్బంలో ఈ చిత్ర రూపకర్తలకు హ్యాట్సాప్ చెపుదాం.


మేఘన గుండ్ల