అందరూ అలాగే... బయటపడరు..!
అవును.. అందరూ అలాగే ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బయట పడరూ అంటూ దూరం నుంచి వచ్చిన మా ప్రెండ్ కూర్చుంటూ అన్నాడు. వడెప్పుడూ ఇంతే ఏదో ఒక టాపికోనే నా వద్దకు వస్తాడు. రాగనే ఇదిగో కూర్చొక ముందే నస మొదలు పెడతాడు. కొన్ని సందర్బాలలో నాకు వాడు చెప్పేది అర్థమైనా రోజూ ఎక్కడో ఒక చోట నిత్య జీవితంలో ఎదురు చూసే సంఘటనే కదా అనుకుంటూ వాడి వద్ద వాదించను.
కానీ ఈరోజు వాడు తెచ్చిన ప్రస్తావన కొంచం విచిత్రంగా అనిపించింది. అదేంటంటే ప్రతి మనిషిలోనూ స్వార్థం ఉందనటం. నేను అలా ఒప్పుకోనని వాదించా. వెంటనే వాడు "ఎప్పుడైన మనలోని నిజాన్ని బహిరంగంగా కాకపొయినా వ్యక్తిగతంగానైనా అంగీకరించగలిగితే నిజంగా మనకంటే మహాపురుషుడు ఉండడు" అన్నాడు. అలా అని వెంటనే ప్రతి మనిషి అశాజీవే.. ప్రతి వ్యక్తి ఏదో తెలియని ఆరటంలో నిత్యం పొరాడుతూనే ఉంటాడు. అందులోనే స్వార్థం దాగివుంది. బార్య భర్తల నడుమ, తల్లిదండ్రుల నడూమ, పిల్లల నడుమ, డబ్బు విషయంలో, ఉద్యోగ విషయంలో, కొనుగొల్లు, విక్రయాలు, అవినాభావ సంబంధాలు, ఈగోలు, స్నేహ బంధాలు, ప్రేమలు, నిరాశ, నిస్పృహలు, సత్సంబంధాలు, కన్నీటి కథలు, సినిమాలు, ఆనందాలు... ఇలా ఏదో ఒక విషయంలో మనిషి రోజూ తన స్వార్థాన్ని తనలోనే నీవురుగప్పిన నిప్పులా పెంచి పోషిస్తున్నాడు. కాని ఎవ్వరూ బయట పడరు. ఇది వాడు నాకు ఉపదేశించిన జీవితసారం.
చివరకు ఒప్పుకున్నాను.. వెంటనే చూశావా ఇదీ స్వార్థమే అన్నాడు. ఎలారా అంటే... నేను అనే అహం మనలో ఉందందంటేనే అది స్వార్థం అవుతుంది. ప్రతి వ్యక్తి ఇదే తరహాలో నేనున్నాను అనే వాదనలొ జీవిస్తాడు. కాని అదంతా తనకోసమే చెసుకుంటున్నాడనేది అంగీకరించడు. అందరూ అలాగే. కానీ బయటపడరు. ఈ బయట పడని వారిలో నేనున్నా. నీవున్నావు. అందరూ ఉన్నారు. లేదు నేను స్వార్థ పరుడిని కాదు అనే మనిషున్నాడంటే అది అతని అహానికి పరాకాష్టే అవుతుంది అని ఓ చిన్న నవ్వు నవ్వి వెళుతూ మనం స్వార్థ పరులం.. మనకోసం మనం జీవించటంలో. దీనిని అంగీకరించం. అందరూ అలాగే బయట పడరు అంటూ రేపొస్తా బై అన్నాడు. ఈ విషయం అలోచిస్తూ.. మళ్ళి వాడొచ్చేంతవరకు కొన్ని వాస్తవాలను నెమరు వేసుకుంటున్నా...
మేఘన గుండ్ల
<< Home