"పదహారేళ్ల వయసు"కు 30 ఏళ్లు
ఇంతిలోని సొగసు సోయగాల చక్కిళ్ల నవ యవ్వన ప్రౌడతనాన్ని చూడాలంటే అది "పదహారేళ్ల వయసు"లోనే సాద్యమవుతుంది. ఆ వయస్సులోనే ముగ్ధమనోహర స్త్రీ తనలో దాగిన అందాల ప్రాయంలోని పాలుగారే రసజ్ణత చూపిస్తోందని కవులు, పండితులు, రచయితలు తమ బావాల్లో వ్యక్తీకరించారు. నిజమే ఆ వయస్సులోని కోరికల గుర్రాలకు కుర్రాకారు పరుగుపెట్టేది.
పదహారేళ్ల ప్రాయంలోని అందమైన ముచ్చటలు.. ఊహలు.. కలలను అంబరాన్ని తాకేల ఉర్రూతలూగించిన చిత్రమే "పదహారేళ్ల వయసు". పదహారేల్ల పడుచు ప్రాయాల యవ్వనపు రోజులను రక్తి కట్టించిన ఈ చిత్రానికి చూస్తుండగానే 30 ఏళ్లు నిండాయి. 1978 ఆగష్టు 31న విడుదలైన ఈ చిత్రానికి 30 ఏళ్లు నిండాయి. సిరిమల్లె పువ్వా... అంటూ గాయని ఎస్ జానకి గొంతులోని మాదుర్యానికి అప్పుడే 16 ఏళ్లల్లో అడుగుపెట్టిన శ్రీదేవిలోని కన్నె వయసు పరువాలకు ప్రేక్షకులు పట్టిన నీరాజనం నేటికి చెక్కు చెదరకుంటా ఆపాత మదురాన్ని తెలుగునాట గుండెల్లో దాచుకున్న ఎందరో ఉన్నారు.
రాజ్యలక్ష్మి ఆర్ట్ ఫిలింస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం వాస్తవానికి పదునారు వయదినిలే అనే తమిళ చిత్రానికి మాతృక. బారతీరాజా దర్శకత్వంలో శ్రీదేవి, కమల్ హాసన్, రజని కాంత్ నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో మిద్దే రామారావు నిర్మించారు. దర్శకుడిగా రాఘవేంద్రరావు తమిళ మాతృకలోని శ్రీదేవినే తెలుగులో కూడా నటించాలని పట్టుబట్టి మరీ చేయించారట. ఇక తెలుగు వెర్షన్ లో చంద్రమోహన్, మొహన్ బాబు నటించారు. తమిల్ చిత్రానికి ఇళయరాజ సంగీతం అందించగా తెలుగుకు చక్రవర్తి. అయితే అప్పటికే తమిళ్ లో సిరిమల్లే పువ్వా... పాట సంచలనం సృష్టించటంతో ఆ పాట ట్యూన్ అలాగే తెలుగులో వాడారు.
తమిళ్, తెలుగు భాషల్లో ఈ చిత్రం ఘన విజయం సాధించగా హిందీలో అపజయం పాలయింది. హిందీ చిత్రానికి బారతీరాజానే దర్శకత్వం వహించగా అక్కడ కూడా శ్రీదేవే హీరోయిన్. ఈ చిత్రంలో నటించినందుకు శ్రీదేవికి అప్పట్లోనే 50 వేల పారితోషికం అందించగా చంద్రమోహన్ కు 17 వేలు, మోహన్ బాబుకు 15 వేలు ఇచ్చారట. ఈ చిత్రాన్ని ఎన్ టీఆర్ కు ప్రత్యేకంగా వేసి చూపించగా ఇందులోని శ్రీదేవిని చూసిన ఆయన తన తదుపరి చిత్రమైన వేటగాడు లో హీరోయిన్ గా తీసుకున్నారు.
"పదహారేళ్ల వయసు" విడుదల తర్వాత ఇందులో నటించిన నటులందరు స్టార్స్ గా నిలదొక్కుకున్నారు. తమిళ్ లో పల్లెటూరు అమాయక పాత్రలో కమల్, పోకిరి పాత్రలో రజని, తెలుగులో పొకిరిగా మోహన్ బాబు, అమాయకుడిగా చంద్రమోహన్ ల నటన వీరంతా పెద్ద హీరోలుగా వెలుగు చూసేలా చేసింది. ఇక అందాల మల్లిగా నటించిన శ్రీదేవి ఏకంగా బాలివుడ్ లోనే తిష్టవేసి అగ్ర తారగా నిలిచింది. ఈ చిత్రం తమిళ్ లో విజయం సాధించగానే తెలుగు వెర్షన్ లో నటించేందుకు పెద్ద తారలే ముందుకు వచ్చారు. కథలో బలం, కథను నడిపించిన తీరు, తారల నటన పెద్ద హీరోలు లేకున్నా చిత్రం ఘన విజయం సాధించేందుకు కారణమైది. 1978లో విడుదలైన ఈ చిత్రం నేటికి 30 ఏళ్లు పూర్తి చేసుకుని సిందూర పువ్వా.. అంటూ పదహారేళ్ల వయసును జ్ఞాపకం చేస్తున్న శుభ సందర్బంలో ఈ చిత్ర రూపకర్తలకు హ్యాట్సాప్ చెపుదాం.
మేఘన గుండ్ల
<< Home