చిరంజీవి ప్రజా రాజ్యం
ఎట్టకేలకు చిరు తన ప్రజా రాజ్యం పార్టీ పేరును ప్రకటించారు. ప్రేమే లక్ష్యం, సేవే మార్గంగా లక్షలాది అబిమానుల నడుమ ప్రజల పాలించే పార్టీగా ప్రజారాజ్యం ఉంటుందని వెళ్ళడించారు. తిరుపతిలోని ప్రజా అంకిత వేదిక నుంచి పార్టీని ప్రకటించిన చిరంజీవి వికలాంగుల చేత పార్టీ జెండాను ఆవిష్కరింప చేశారు. భారత జాతీయ పతాకం పొలినట్లుగా ఆకుపచ్చ, తెలుపు రంగుల్లో పసుపు నడుమ ఎరుపు రంగులోని సూర్యుడి గుర్తును ముద్రించిన పాతాకం గురించి చిరంజీవి వివరించారు. ఇప్పటి వరకు ఏలిన ప్రభుత్వాలను విమర్శించిన చిరంజీవి పేదలే తమ రాజ్యాన్ని ఏలే సందర్భాన్ని తీసురావటమే ద్యేయంగా ముందుకు నడుస్తానని ప్రకటించారు.
<< Home