Monday, August 25, 2008

నేనింతే...(సినిమా కాదు..జీవితం)




అవును నేనింతే అన్నాడు మా నానిగాడు.. మొన్నామద్య వాళ్ళ మమ్మీతో తెగ సీరియెస్ గా అంటున్న ఆరేళ్ళ నాడిగాడి మాటలు నాకు అర్థం కాలేదు. అందుకే ఆ విషయం గురించి పట్టించుకోకుండా నేనూ హిందులో వచ్చిన ఓ ఆర్టికల్ ను సీరియెస్ గానే చదవటం మొదలు పెట్టా. అలా ఆర్టికల్ ప్రారంభించానో లేదో వెనుక నుంచి మా నాని గాడి స్వరం మరో మారు బిగ్గరగా వినిపించటంతో ఇకా లాభం లేదని వాడి సమస్యేంటో తెలుసుకుందామని నిర్ణయించా. అటువైపు తిరిగి అసలు విషయమేంటో తెలుసుకుందామని నాడిగాడిని పిలిచా. వాడు నా వద్దకు రాలేదు సరికదా నేను పిలుస్తున్నాననే ఆలోచనే లేకుండా దీర్ఘంగా ఆలోచిస్తున్న వాడిలా ఓ పోజుపెట్టి వాళ్ళ మమ్మికి ఏదో నచ్చజెప్పాలని ప్రయత్నిస్తున్నాడు. ఇలా కాదని కుర్చిల్లోంచి లేచి వాడి వద్దకు వెళ్ళా. ఏం నాన్న విషయం ఏమిటీ? అంటూ వాడిని చిన్నగా బుజ్జగించాలని ప్రయత్నించా. అయినా వాడు ఇంకా మౌనంగానే ఉండటంతో వాడి మమ్మినీ అడిగా. అప్పటి వరకు వాడితో వాదనకు దిగిన కోపానంతా కంట్రొల్ చేసుకుంటూనే వాడినే అడగండి అంటూ తను వంటగదిలోకి వెళ్ళింది.
దీంతో సరాసరి నాని గాడి వద్దే తేల్చుకుందామని చిన్నగా విషయం రాబట్టే ప్రయత్నం చేసా. విషమేమిటంటే... వాడు ప్రతి విషయాన్ని ఈజీగా తీసుకోవటమే. స్కూలుకు వెళ్ళే దగ్గర నుండి తను వేసుకునే డ్రెస్, తినే తిండి, మాట్లాడే తీరు అంతా పైన హెడ్డింలో రాసామే అదే నేనింతే. నాకు నచ్చిందే చేస్తా. అలా కాదు నాన్న అంటే... ఎందుకు కాదు అంటాదు. ఎట్టకేలకు వాడు అలా మాట్లాడటానికి కారణమేమిటని బుజ్జగించి విషయాన్ని రాబడితే నాకు తెలిసిన నిజంతో అవాక్కయ్యా.
ఇంతకు విషయమేమిటంటే... ఇటీవల వచ్చిన సినిమాల్లోని హీరోలంతా అలాగే తమకు నచ్చిందే చెస్తున్నారట. ఆ విషయాలు నీకెలా తెలుసురా అంటే చివరకు టీవీ పెడితే చాలు ఆయా సినిమాల్లోని ట్రైలర్లలో కూడా అటువంటి సన్నివేశాలే సాక్షాత్కరిస్తున్నాయట. అవన్ని సినిమాలు జీవితంలో పనికి రావని చెపితే ఎందుకు పనికి రావని తిరిగి నన్నే ప్రశ్నిస్తాడు. మొన్నా మద్య ఓ హీరో గారు తన టీవీ ఇంటర్యూలో నేను బయట ఏఅ ఉంటానో సినిమాల్లో కూడా అలాగే జోవియల్ గా ఉంటాను అన్నాడట. దీంతో మావాడికి ఎలా నచ్చజెప్పలో అర్థంకాక తల పట్టుకోవాల్సి వచ్చింది. చివరకు నానిగాడిని కూర్చొబెట్టి ఓ గంట క్లాస్ ఇచ్చిన తర్వాతగాని వాడు మామూలు స్థితికి రాలేదు. దీని ద్వారా నాకు తెలిసిందేమిటంటే... పిల్లలను టీవీలకు, సినిమాలకు దూరంగా ఉంచటం ద్వారా మనం కూడా మన శాంతిగా ఉండవచ్చని. నిజం... ఇది ప్రతి ఇంట్లో ఏదో ఓ సందర్బంలో వెలుగు చూసేదే. కాని బయటపడం. నా వరకు వచ్చేంత వరకు నెనూ ఇంతేగా. అందుకు ఇప్పుడు నేను నిర్ణయించుకున్నదేమిటంటే... నేనింతే?. ఎక్కడంటే టీవీ, సినిమాల విషయంలో.

మేఘన గుండ్ల