Wednesday, August 27, 2008

సినిమావొళ్లంతా...




పొద్దున మా అవ్వ(అమ్మమ్మ)కు ఫోన్ చేశా. అరే పెద్దొడా.. ఆ సినిమా అయనున్నాడే అదేరా సిరంజీవి పార్టీ పెట్టిండటగా నీకు తెలుసారా. ఆ తెలుసే అయితేంటీ అన్నా?. ఏం లేదురా గప్పుడెప్పుడో ఎన్ టోడు (ఎన్ టీఆర్)తెలుగు దేశం పెట్టి మన ఊరుకొచ్చిండు. మాతో సక్కగా మాటాడిండు అందుకే మేమంతా ఆయనకే ఓటేసాం. మగానుబావుడు రెండు రూపాయిలకే బియ్యం, ఇస్కూలు పిల్లలకు అన్నం, ఉంటానికి ఇల్లూ ఇచ్చిండు. ఆ తర్వాత శానా మంది సినిమావొళ్లు పార్టీల్లోకి వచ్చిన ముకం కూడా చూపించలేదు. మళ్లీ శానాళ్లకి ఇప్పుడు సిరంజీవి పార్టీ పెట్టిందు. ఈనేమో పెజలు అంటూ ఎన్ టోడి మాటలు మాటాడిందు. నిజంగా ఎన్ టోడిలా మన ఊరొస్తాడా?. మాతో మాటాడతాడా?. అయినా ఎన్ టోడి బుద్ది వీళ్లకుందా. ఉన్నదంతా తనోళ్లకు దాసుకునే ఈ సినిమావొళ్లంతా పార్టీలు పెట్టి మనకేం సేస్తారట. అంటూనే అయినా సిరంజీవి మాటలు మళ్లి ఎన్ టోడిలా ఉన్నాయిరా. నమ్మి ఓటెయ్యచ్చంటావా అంది. అంతే నాకు చిర్రెత్తుకొచ్చినా సినిమావోళ్లు అంటూనే మాటలు బాగున్నయని ఓటేస్తానని అన్న మా అవ్వ మాటలతో ఆలోచన్లో పడ్డా. మా అవ్వలాంటి వారెందరో నిజంగా మనకు మంచి జరుగుతుందని నమ్ముతూ ఓటేస్తాననటంలో వారికున్న నమ్మకానికి హ్యాట్సాఫ్ చెప్పొచ్చేమో. తధా నమాక్కం విజయం కావాలని ఆకాంక్షిద్దాం.


మేఘన గుండ్ల