Saturday, August 30, 2008

కొన్ని కబుర్లు...(అవి ఇవి అన్నీ)





కొద్దిసేపు మౌనంగా ఉంటే... ఎన్నో ఆలొచిస్తే. బుర్ర కూడా పాడవుతుంది. అలా కాకుండా అవి ఇవి అన్ని తెలుసుకుంటే కాస్త ఉపశమనంగా ఉంటుంది. ఇదో సిల్లీగా ఇలా కొన్ని చదివితే ఇంకా... మరి మీ ఇష్టం..?


లోకేష్, బ్రహ్మణిని వివాహంతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, నటుడు బాలకృష్ణ వియ్యంకులై తెలుగుదేశానికి పునరుత్తేజం తీసుకురావాలని కలలు కంటున్నారు. మరి నిజమవుతాయా... వెయిట్ చేయాలిమరి..?


ప్రజారాజ్యం పార్టీ పేరుపై కడప జిల్లా వాసి నుంచి వచ్చిన హక్కుల అంశం ఇరువర్గాల చర్చల ద్వారా సుఖాంతం కావటం చిరంజీవి ఊపిరిపీలుకునేలా చేసింది. అయితే దీనిద్వారా కడప జిల్లా వాసి ఏమేరకు లాభపడ్డారో... ష్.. గప్ చిప్..?


బాలకృష్ణ, చంద్రబాబు వియ్యంకులైతే మేమేమైన తక్కువ తిన్నమా అంటూ వైఎసార్, మొహన్ బాబు అనుకున్నటున్నారు. వారు త్వరలో వియ్యంకులు కావటానికి అన్ని ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఇదే మరి అసలు రాజకీయమంటే.. ఏమంటారు.. సార్లూ...?


లక్ష్మీ కళ్యాణం చిత్రం ద్వారా పరిచయమైన కాజల్ ఆరంభ అంత శుభం పలకకపోయినా చందమామ తర్వాత యమా స్పీడ్ గా వెళుతోంది. వరుస చిత్రాలతో గ్లామర్ కు సైతం సిద్దమంటున్న ఈ భా నా నాజూకు అందానికి యోగానే కారణమని చెపుతోంది. బలేగా చెప్పిందికదా..?


యోగా మస్టర్ నుంచి హీరోయిన్ అయిన అనుష్క అందాల ఆరబోతలో ముందుండటం బాగానే లాభించింది. వరుస చిత్రాలతో యమా జోరుగా అందాలు ఆరబోస్తుందో రాబోయే చిత్రాలు చూస్తే అర్థమవుతుంది. ఇంకేం.. కుర్రకారుకు కనుల పండుగే..?


సానియా... హలో టెన్నిస్ స్టార్ అనుకునేరు హ్యాపీడేస్ లోని శ్రావ్స్ అదే సానియా ఆ చిత్రంతో పిల్మ్ పేర్ అవార్ద్ కొట్టేయటమే కాకుండా హీరోయిన్ గా అవకాశాలు చేజిక్కించుకుంది. వినాయాకుడు చిత్రం ద్వారా సాని నిలదొక్కుకునే ప్రయత్నం ఆ విఘ్న రాజే తీర్చాలిమరీ..?


ఉల్లాసంగా.. ఉత్సాహంగా... చిత్ర హీరోయిన్ స్నేహా ఉల్లాల్ అలాగే ఉంది. నిన్ను చూస్తే ఐశ్వర్యలా ఉన్నావని ఓ ప్రముఖ దర్శకుడన్నారట. అయన నోటి పుణ్యమో లేక అదృష్టమోగాని అమెను అందరు ఐశ్వర్యా అంటూ పొగుడుతూ అవకాశాలు కూడా ఇస్తున్నారు. కలిసొస్తే ఇంతే.. స్నేహా.. సారీ అచ్చు ఐశ్వర్యా బెస్ట్ ఆఫ్ లక్.


ఇప్పటికే న్యూస్ చానళ్ల హడావుడితో చస్తున్న తెలుగు ప్రజలు తలపట్టుకునే ప్రమాదం వస్తుందని వార్తలు వస్తున్నాయి. కారణమేంటని ఆరాతీస్తే వచ్చే నాలుగైదు నెలల్లో మరో 9 చానళ్లు రాబొతున్నాయట. ఉన్న చానళ్లతో చస్తుంటే వచ్చే చానళ్ల హడవుడి ఎలా ఉంటుందో అన్నదే తెలుగు వారి భయం.. ఆలోచించాల్సిన విషయమే...?

మేఘన గుండ్ల