Friday, August 29, 2008

జగమంత కుటుంబం నాది...



ఇదో కృష్ణవంశి దర్శకత్వంలో ప్రభాస్ నటీంచిన "చక్రం" చిత్రంలోని ఈ పాట ఎప్పుడో విని ఉంటారు. నిత్యం మానసిక సంఘర్షణల నడుమ జీవితాన్ని ఈడ్చుతున్న మనలాంటి వారికి ఇది చక్కగా సరిపోతోందన్నది నా అభిప్రాయం. ఎప్పుడో వచ్చిన ఈ పాటకు నీ అభిప్రాయం ఎవడికి కావాలని అనకండి. ఎందుకంటే సమస్యలతో సతమతమయ్యే ప్రతివ్యక్తి వినాల్సిన ఈ పాటను ఓ బ్లాగర్ మిత్రుడు ఈ మద్య వెలువరిచాడు. ఎందుకో తెలీదు కానీ వెంటనే ఆ పాటను పదిసార్లకు పైగానే చదివుంటా. అందుకే ఇంత చక్కటి పాటే కాదు ఇందులోని ప్రతి పదం... జగమంతా విస్తరించిన తెలుగు లోగిలికి చేరాలన్నది నా ఆశ. చేసే ప్రయత్నం విజయం సాధిస్తుందా..? అనే విషాయాన్ని నేనసలు పట్టించుకోను. సంఘర్షణల నడుమ కొట్టుమిట్టాడే ప్రతి తెలుగు గుండెను స్పందించ గలిగిన ఈ పాటను చదివి లేక ప్లేయర్ లో విని ఆశ్వాదించితే చక్కటి మానసిక ఉపశమనం దొరుకుతుందని నా ఆకాంక్ష. ఇదుగో పాట...

జగమంత కుటుంబం నాది – ఏకాకి జీవనం నాది
సంసారసాగరం నాదే – సన్యాసం, శూన్యం నావే
కవినై, కవితనైభార్యనై, భర్తనై
మల్లెలదారిలో, మంచు ఎడారిలో
పన్నీటి జయగీతాల, కన్నీటి జలపాతాల
నాతో నేనే అనుగమిస్తూ, నాతో నేనే రమిస్తూ,
ఒంటరినై అనవరతం, కంటున్నాను నిరంతరం
కలల్ని, కధల్ని, మాటల్ని, పాటల్ని, రంగుల్ని, రంగవల్లుల్ని,
కావ్యకన్యల్ని, ఆడపిల్లల్ని
మింటికి కంటిని నేనై, కంటల మంటను నేనై,
మంటలమాటున వెన్నెల నేనై, వెన్నెలపూతల మంటను నేనై
రవినై, శశినై, దివమై, నిశినై
నాతో నేనే సహగమిస్తూ, నాతో నేనే రమిస్తూ,
ఒంటరినై అనవరతం, కంటున్నాను నిరంతరం
కిరణాల్ని, కిరణాల హరిణాల్ని, హరిణాల చరణాల్ని, చరణాల చలనాల గమ్యాన్ని,
కాలాన్ని, ఇంద్రజాలాన్ని

గాలి పల్లకిలోన తరలి నా పాటపాప ఊరేగి వెడలె
గొంతు వాకిలిని మూసి మరలి మూగవోయి నా గుండె మిగలె
నా హృదయమే నా లోగిలి – నా హృదయమే నా పాటకు తల్లి
నా హృదయమే నాకు ఆలి – నా హృదయములో ఇది సినీ వాలి

మేఘన గుండ్ల