Friday, August 29, 2008

నాకు నచ్చింది... "కూచిపుడి"





సంస్కృతి, సాంప్రదాయాలకు ఆలవాలమైన మన రష్ట్రానికి గుర్తిపు తెచ్చిన కళలెన్నో ఉన్నాయి. ఇందులో ప్రదానంగా భరతీయ నాట్యాలలో నతస్థానంలో ఉన్న కూచిపుడి ప్రధానంగా చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని మారుమూల ప్రాంతమైన కూచిపుడి అనే ఊరిలో పుట్టిన భారతీయ ఆంప్రాదాయ నృత్యానికి ఆ ఊరి పేరే స్థిరపడింది. శాస్త్రీయ సంగీతానికి అనుగునంగా రాగ, తాళ, భావ యుక్తంగా, పాదాలు పదముల అందెల రవములుగా అద్వితీయ విన్యాసంగా వెలుగు చూసిందే కూచిపుడి.


భరత నాట్యానికి భిన్నంగా 17వ శతాబ్ద కాలంలో సిద్దేంద్ర యోగి కూచిపుడిలోని కుర్రకారుకు డ్రామాలలో నాట్యంగా దీనిని నేర్పించే వారట. అలా ఈ నృత్యం చక్కని సంప్రదాయ, దైవాంశకరంగా ఉండటంతోపాటు అందరి మన్ననలు పొందటంతో సిద్దేంద్ర యోగి కూచిపుడిలో పుట్టిన ఈ నాట్యానికి కూచిపుడి అని పేరును పెట్టారు. తదనంతరం ఈ నృత్యం ప్రపంచ నలుదిక్కుల వెలుగు చూసేందుకు ఎందరో కృషిచేశారు. ఈ నృత్యం వెలుగు చూసిన అంతి కాలంలోనే భారతీయ నట్యాలలొ ఒకటిగా స్థనం సంపాదించుకుంది. కూచిపుడి నట్యంలో భామా కలాపంతొపాటు నృత్య రూపకాలు ప్రపంచ ప్రసిద్ది చెందాయి. ఆరంభంలో దేవదాశీల నుంచి సినిమాల్లో నృత్యాల వరకు ఈ నత్యం పరసిద్ది చెందింది.


ఈ నృత్యాభినయం ఆషామాషి కాదు. నిష్టతొ, నిబద్దతతో, తపస్సుల అభ్యసిస్తెనే ఈ నాట్యం యొక్క పూర్తి అర్థం, పరమార్థం అవగతమవుతుంది. ప్రదనంగా ఈ కలలో కరములు, పాదాల భంగిమలకు ప్రత్యేక అర్థం ఉమది. ముఖ్యంగా అసమ్యుత హస్తంలో 24 కర భంగిమలు, సమ్యుత హస్తంలో 12, నృఇత్త హస్తంలో 30, స్తానకాస్ లో ఆరు భంగిమలు, పదబేదలలో ఆరు, బౌమిచారిలో 16, ఆసిక చారిలో 16 భంగిమలు ప్రదానమైనవి. ఈ నాట్యానికి సంగీతం కూడ అతి ప్రదానం.

భామా కలాపం


కూచిపుడి నాట్యాన్ని రూపొందించిన సిద్దేంద్ర యోగి ఆరంబ కాలంలోనే నృత్య రూపకాలను ప్రదర్శించేవారు. ప్రధానంగా కృష్ణ పరమాత్ముడు, సత్యభామల నడుమ సాగే సరస సల్లాపాలను సిద్దేంద్ర యోగికూచిపుడి నాట్యాన్ని గొల్లకలాపం పేరుతో ప్రత్యేక నృత్య రూపాన్ని ఇచ్చారు. అదే తదనంతరం భామా కలాపంగా ప్రపంచ ప్రక్యతిగాంచింది. సత్యభామ విరుపులు, వయ్యారాలు కూచిపుది నాట్య హావభావాలలో ఒక క్రేజును సృష్టించింది. కథకళిలో యక్షగానంలా కూచిపుడిలో భామాకలాపం స్థిరపడిపోయింది.


ఎందరో మహానుభవులు


ఈ కళ ప్రాపంచ వ్యప్తం కావటానికి ఎందరో మహానుభావులు కృషిచేశారు. సిద్దేంద్ర యోగి తర్వాత చింతా వెంకటరామయ్య, వెంపటి వెంకటనారాయణ, వేదాంతం లక్ష్మి నారాయణ స్వామి, మాదవయ్య హరి, తాడేపల్లి పేరయ్య, వేదాంతం రాఘవయ్య, పసుమర్తి సుబ్రమణ్య శాస్త్రి, పసుమర్తి కృష్ణమూర్తి, మహాకాళి చిన సత్యనారాయణ, వెంపటి చిన సత్యం, రాజా రెడ్డి, రాధా రెడ్డి, మంజులా నాయుడు, మంజు భార్గ్గవి తదితర ఎందరో కూచిపుడిని విశ్వవ్యాప్తం చేశారు.



పద్మభూషన్ వెంపటి చిన సత్యం గారి సహకారంతో... మేఘన గుండ్ల