రెండో ఇన్నింగ్స్ లో జేడీ సక్సెస్...!
శివ చిత్రం ద్వారా రాం గోపాల్ వర్మ పరిచయం చేసిన నటుల్లో జేడి చక్రవర్తి(గడ్డం చక్రవర్తి) ఒకరు. శివ తర్వాత చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక పంధాను ఏర్పర్చుకున్న జేడి ఈ మద్య కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే తిరిగి దుబాయ్ శీను చిత్రం ద్వారా నటుడిగా కనిపించిన చక్రీ నటనకంటే తన గురువైన రాం గోపాల్ వర్మ పంధాలో దర్శకుడు కావాలనే కలను నిజం చేసుకునే ప్రయత్నంలో పడ్డారు. ఇందులో బాగంగానే ఈ మద్య జగపతిబాబును నటించిన "హోమం" ద్వారా చక్రీ దర్శకుడయ్యారు. ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా చక్రీ మంచి మార్కులే కొట్టెశాడని కోలివుడ్ నుంచి వచ్చిన ప్రశంస.
ఆరంభ కాలంలో నటుడిగా మంచి క్రేజ్ ను ఏర్పర్చుకున్న జేడీ అసలు కల దర్శకుడవటమే. అయితే ఎలాగో హోమం ద్వారా మంచి మార్కులే వచ్చిన చక్రీకి ఇప్పుడు దర్శకత్వంకంటే నటనావకాశాలు కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్నాయి. అందునా తమిళ్లో అయితే ఏకంగా రజనీకాంత్ చిత్రంలో విలన్ గా నటీంచే అవకాశం వచ్చింది. హోమం చిత్రం చూసిన దర్శకుడు శంకర్ చక్రీని తమ రోబొలో విలన్ గా నటించాలని పట్టుబట్టారు. దీనికి ముందే సర్వం అనే చిత్రంలో విలన్ గా నటించేందుకు అంగీకరించిన చక్రీ కొత్తగా రోబోతోపాటు మరికొన్ని చిత్రాలలో నటించేందుకు అంగీకరించినట్లు తెలిసింది.
దర్శకుడిగా కెరీర్ ను పెంచుకుందామని ప్రయత్నిస్తున్న చక్రీకి నటనావకాశాలు వెల్లువెత్తుతుండటంతో ఆయన రెండవ ఇన్నింగ్స్ విజయపధాన్నే వరిస్తుందని చెప్పొచ్చు. రాం గోపాల్ వర్మ శిష్యుడిగానే సుపరిచితమైన చక్రీ ఏకంగా ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం చిత్రంలో నటించటం ద్వారా జాతీయ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా సత్య ద్వారా బాలివుడ్ చిత్రసీమలో తనకంటూ గుర్తింపుతెచ్చుకున్న చక్రీ మంచి నటనకు అవకాశమున్న పత్రల్లను ఎంపిక చేసుకుంటూ తన కెరీర్ ను విజయపధంలోకి తెసుకెళుతుండటం అభినందించదగ్గ విషయం.
మేఘన గుండ్ల
<< Home