Thursday, August 21, 2008

''శ్రీ రామదాసు ''


తెలుగు సినిమా అణిముత్యాలు

''శ్రీ రామదాసు ''

తెలుగు సినీ చరిత్రలో అణిముత్యాలుగా కోట్లాది ప్రజల అదరాభిమానాలు పొందిన చిత్రాల్లో 2006 మార్చి 30న ఆంద్రదేశంలో విడుదలైన శ్రీ రామదాసు ఒకటిగా మన్ననలు పొందింది. భక్తిని, ముక్తిని ప్రసాదించే దైవమైన శ్రీరామచంద్రమూర్తి కథనంతో తెరకెక్కిన ఈ చారిత్రత్మక చిత్రం తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్మరణీయ మధురానుభూతిని నింపింది. కే.రాఘవేంద్రరావు నిర్దేశకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర రాజంలో అక్కినేని నాగార్జున, స్నేహా ముఖ్య భూకలు పొషించారు. ప్రధన పాత్రలను అక్కినేని నాగేశ్వరరావు, నాజర్, నాగేంద్రబాబు, శరత్ బాబు పోషించారు. ఎం ఎం కీరవాణి అందించిన సంగీతం, ఎస్ గోపల్ రెడ్డి చాయాగ్రహణం, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, రాఘవేంద్రరావు దర్శకత్వం, దైవాంశ సంభూతుడైన శ్రీరామచంద్రుడి కథ ఈ చిత్రం బాక్స్ ఆపీస్ హిట్ గా నిలబెట్టింది.

మూల కథ

భద్రుడు (శరత్ బాబు)భక్తికి మెచ్చి శ్రీరామచంద్రమూర్తి భద్రాచలం అటవీ ప్రాంతాలలో వెలుస్తాడు. అయితే కాలక్రమేణ అక్కడ అటవి ప్రాంతంలో మరుగున పడిన శ్రీరాముడికి ఆలయం కట్టించి నిత్య పూజలు నిర్వహించాలని గిరిజన మహిళైన దమ్మక్క (సుజాత) ఎవరైన సహాయం చేస్తారేమోనని ఎదురుచూస్తుంటుంది. గోపన్న (నాగార్జున)యువకుడు తన మేనకోడలైన కమల (స్నేహను) వివాహాం చేసుకుని గొల్కొండ నవాబైన తానీషా అదేశాల మేరకు హుస్నాబాద్ కు తహసిల్దార్ గా వస్తాడు. ఇది నచ్చని తానిషా బావమరిది గొపన్నపై హత్యయత్నం జరిపిస్తాడు. ఈ ప్రమాదం ద్వారా నీళ్ళలో కొట్టుకుపోతున్న గోపన్నను దమ్మక్క కాపాడుతుంది. గాయాల నుండి బయటపడ్డ గోపన్నే తమ ప్రాంత తహసిల్దార్ అని తెలుసుకున్న దమ్మక్క శ్రీరాముడికి ఆలయం కట్టించమని కోరుతుంది. అంతే కాకుండా ఆ స్వామి దయ వల్లే ప్రమాదం నుండి బయటపడినట్లు గోపన్న గ్రహిస్తాడు. దీంతో గోపన్న భద్రగిరి కొండల్లో రాముడికి ఆలయం కట్టించేందుకు విరాళాలు వసూలు చేసి అనుకున్నట్లుగానే ఆలయాన్ని నిర్మిస్తాడు. తద్వారా గోపన్న రామదాసుగా పేరొందుతాడు. అయితే ఆలయం కట్టించటం నచ్చని తానిషా బావమరిది రామదాసుపై లేనిపోని అసత్యాలను తానిషాకు చెపుతాడు. దీంతో ఆగ్రహించిన తానిషా రామదాసును జైల్లో పెడతాదు. శ్రీరామచంద్రమూర్తి తానిషా కళ్ళు తెరిపించి రామదాసును జైలు నుండి విడిపిస్తాడు. చివరకు రామదాసుకు శ్రీరామచంద్రమూర్తి ప్రత్యక్షం కావటం, రామదాసు కళ్ళు మూయటంతో సినిమా దైవ భక్తితో ముగుస్తుంది.

సాంకేతిక వర్గం

కథ, మాటలు : జేకే.బారవి
చాయాగ్రహణం :ఎస్.గోపాల్ రెడ్డి
ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్
ఆర్ట్ డిరెక్టర్ : భాస్కరరాజు
సంగీతం : ఎం ఎం కీరవాణి
నిర్మాత : కొండ కృష్ణం రాజు
స్క్రీన్ ప్లే, దర్శకత్వం : కే.రాఘవేంద్రరావు

పాటలు

శ్రీరాఘవం : ఎం ఎం కీరవాణి
అదిగదిగో భద్రాద్రి : ఎస్పీ బాలు
హైలెస్సా : ఎం ఎం కీరవాణి, దేవిశ్రీప్రసాద్, మాళవిక
అంతా రామమయం : ఎస్పీ బాలు
ఇష్వాకులకు : శంకర్ మహాదేవన్
అల్లా... : శంకర్ మహాదేవన్, విజయ్ జేసుదాస్
ఇదిగిదిగో : సినిత
చరణములనే : మదుబాలకృష్ణన్, చిత్ర, రామాచారి
చాలు చాలు : ఎస్పీ చరణ్, సునిత
శ్రీరామ రామేతి : ఎం ఎం కీరవాణి
ఎంతో రుచిరా : ఎస్పీ బాలు
పలుకే బంగారమాయెనా : కీరవాణి, చిత్ర
శుద్ధబ్రహ్మ : ప్రణవి
భద్రషీల : హరిహరన్, చిత్ర
ఏతీరుగ : విజయ్ జేసుదాస్
తండ్రిమాట : సునిత
దాశరధీ : ఎస్పీ బాలు
మంగళం : బృందం

విడుదల

ప్రపంచవ్యాప్తంగా 229 స్క్రీన్లలో 2006 మార్చ్ 30న విడుదలైంది.

బాక్స్ ఆపీస్

67 సెంటర్లలో 100 రోజులు

అవార్డులు

ఉత్తమ కుటుంభకథా చిత్రం (రాష్ట్ర ప్రభుత్వ నంది-2006)
ఉత్తమ నటుడు నాగార్జున (నంది)
ఉత్తమ మేకప్ మెన్ రామచంద్రరావు (నంది)