Friday, August 22, 2008

నట 'కమల ' హాసన్


నాటి నుండి నేటి వరకు వెలుగు చూసిన భారతీయ నటుల్లో అధిక సంఖ్యలో అవార్డులు తీసుకున్న నటుడెవరని ప్రశ్నిస్తే ?. ఎటువంటి ఉపోద్ఘాతం లేకుండా చిన్న పిల్లవాడైన టక్కున చెప్పే పేరు కమల్ హాసన్. బాలనటుడిగా వెండితెరంగేట్రం చేసి... పట్టం పూచ్చి చిత్రం ద్వారా హీరోగా రూపాంతరం చెంది ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించినా ప్రతి పాత్రలోను కొత్తదనాన్ని.. పాత్రకు తగ్గట్లు అభినయాన్ని ప్రదర్శించగల నటుడు మన దేశంలో కమల్ హాసన్ ఒక్కడేనని సినీ మేధావులు సైతం అంగీకరించిన విషయం. 50వ వడిలో కూడా నిత్య విధ్యార్థిగా సరికొత్త ప్రయోగాలతో చలాకిగా ఉండే కమల్ హాసన్ జీవితం అందరికి తెరిచిన పుస్తకమే. ఎన్నిమార్లు కమల్ జీవితాన్ని చదివినా ఎప్పటికప్పుడు నిత్యనూతనంగానే ఉంటుంది. ఈ మహా నటుడి గురించి అందరికి తెలిసినా... ఆయన సాధించిన అవార్డులెన్ననే విషయం చాలా మందికి తెలియక పోవచ్చు. ఆయన ఇప్పటి వరకు మూడుసార్లు జాతీయ అవార్డులు, 19 సార్లు పిల్మ్ పేర్ అవార్డులు అందుకున్న ఒకే ఒక్క భారతీయ నటుడు. అందుకే ఇదో ఆయన అవార్డుల వివరాలను అందించేందుకు మేము చేస్తున్న ప్రయత్నం.
జాతీయ అవార్డులు
1. మూండ్రాం పిరై (తమిళ్-1982)
2. నాయగన్ (తమిళ్- 1987)
3. ఇండియన్ (తమిళ్-1996)

పిల్మ్ పేర్ అవార్డులు

1. కన్యాకుమార్ (మలయళం-1974)
2. అపూర్వ రాగంగల్ (తమిళ్-1975)
3. ఒరు ఊదాప్పు కన్సిమిట్టుగిరదు (తమిళ్-1976)
4. 16 వయదినిలే (తమిళ్-1977)
5. సిగప్పురోజాకల్ (తమిళ్-1978)
6. యోద (మలయాళం-1978)
7. వరుమైయిన్ నిరం సివప్పు (తమిళ్-1980)
8. రాజపార్వై (తమిళ్-1981)
9. ఆకలి రాజ్యం (తెలుగు-1981)
10. సాగరసంగమం (తెలుగు-1983)
11. సాగర్ (హింది-1985)
12. పుష్పకవిమానం (కన్నడం-1987)
13. అపూర్వ సహోదర్ గల్ (తమిళ్-1989)
14. ఇంద్రుడు చంద్రుడు (తెలుగు-1989)
15. గుణ (తమిళ్-1991)
16. దేవర్ మగన్ (తమిళ్-1992)
17. కురుధిపునల్ (తమిల్-1995)
18. ఇండియన్ (తమిళ్-1996)
19. హేరాం (తమిళ్-2000)

200 రోజులకు పైగా...

మరోచరిత్ర (తెలుగు) 596
ఏక్ దుజీ కేలియే (హింది)
సాగర్ (హిందీ) 50 వారాలు
గీరఫ్ తార్ (హిందీ) 50
మూండ్రాం పిరై(తమిళ్)
సాగరసంగమ(తెలుగు) 200
స్వాతిముత్యం(తెలుగు) 200
మైఖీల్ మదన కామరజ్ (తమిళ్) 200
అపుఉర్వ్ రాగంగల్ (తమిళ్) 200 రోజులు

ఆస్కార్ కు...

నాయకన్, కురుదిపూనల్, దేవర్ మగన్, హేరాం(తమిళ్)
స్వాతిముత్యం (తెలుగు)ఇండియన్, సాగర్ (హిందీ)
ప్రత్యేకం...
కమల్ బాలనటుడిగా మొదటి చిత్రం కలత్తూర్ కన్నమ్మ. రెండవ చిత్రమైన పార్తాల్ పసితీరుం(తమిళ్)లో ద్విపాత్రభినయంవిలన్ గా నటించిన చిత్రం సొల్లదాన్ నెనికిరేన్(తమిళ్)హీరోగా మొదటి చిత్రం పట్టం పూచ్చిగాయకుడిగా అంతరంగం చిత్రంలో మొదటిసారి నాయిర్ ఒళిమై పాటను ఆలాపించారుసబిత అనే బెంగాలి చిత్రంలో నటించటమే కాకుండా ఓ పాట పాడారుచట్టం ఎన్ కైయిల్ చిత్రంలో హీరోగా మొదటిసారి ద్విపాత్రాభినయంకమల్ వందో చిత్రమైన రాజ పార్వై కు నిర్మాతగా, మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. ఇదే చిత్రంలో యానిమేషన్ వెలుగు చూపారుకమల్ త్రిపాత్రాభినయం చేసిన చిత్రం అపూర్వ సహోదర్ గల్కమల్ నలుగురిగా నటించిన చిత్రం మైఖేల్ మదన కామరాజ్కమల్ మొదటిసారి దర్శకత్వ చేసిన చిత్రం చాచి 420 (హిందీ)కమల్ మొత్తం 16 చిత్రాలను నిర్మించారు
1990లో భారత ప్రభుత్వం కమల్ హాసన్ కు ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు ప్రదానం చేసింది. 1978-79 కానానికి తమిళనాడు ప్రభుత్వ ప్రతిష్టాత్మక కళైమామణి అవార్డు కమల్ అందుకున్నారు.