'అరుందతీ'యం
ఈ మధ్య ఓ మంచి సినిమా చూశా. అదీ.. తెలుగులో. తెలుగులో అని చెపుతున్నారు.. అంటే తెలుగులో మంచి సినిమాలు రావా అని అడగొద్దు. నా వరకైతే మంచి సినిమా చూసి యేళ్ళు గడుస్తుందిలే అందుకే. ఇదంతా ఎందుకు అంటే మళ్ళీ నేను మంచి సినిమా చూశానని చెప్పేందుకే. శ్యాం ప్రసాద్ రెడ్డి చానాళ్ళ తర్వాత పట్టుదలతో తన బ్యానర్ ను నిలపెట్టుకునే ప్రయత్నంలో ఓ అద్బుతాన్నే తెరకెక్కించి తన సత్తాను తిరిగి తెలుగు వెండితెరపై సాక్షాత్కరించారు. ఆయన నిజంగానే అరుందతిని అద్బుతంగా మలిచి తెలుగు సినిమాకో గుర్తింపు తెచ్చారు. అనుష్క కూడా తన నట విశ్వరూపాన్ని వెలికితీసింది. ఇదంతా ఎందుకంటే అరుందతి వంటి మంచి సినిమాలు తీయాలనే ఆలొచన మేము గొప్ప నిర్మాతలం, దర్శకులం అని చెప్పుకునే వారికి రావాలని. గ్లామర్ ను కాకుండా కాస్తా తెలుగుదనాన్ని మేము అని చెప్పుకునే వారు గుర్తుంచుకుంటే మంచిదని గుర్తుచేయటానికే. బడా బాబులు మరి ఆలోచించండి...?
మేఘన గుండ్ల
<< Home