దీర్ఘంగా ఆలోచించి...
ఓ నిర్ణయం తీసుకుందామనుకున్నా. భందాలు, అనుభందాలు, కష్టాలు, భాదాలు ఎందుకని. ముఖ్యంగా ఇంటికి పెద్ద కొడుకుగా పుట్టాడమంటే ఈ బాధ్యాతలు తప్పావనే బెంగతోనే. కానీ నా వల్ల కావటం లేదు. నా స్నేహితుడు ఆ మద్య పారిన్ వెలుతూ ఇదుగో నేనెందుకు వెలుతున్నానో తెలుసా ప్రతీ చిన్న సమస్యకు నేను దూరంగా ఉండాలనే. దీనికితోడు వాడొక మంచి మాట చెప్పాడు. ఎమంటే 'మనం మోస్తున్నంత సేపూ ఇంకా మనపై బరువు మోపాలనే చూసే వారే మనకు సమస్యను సృష్టిస్తారే తప్ప సొంత వారు కాదు. అయితే సొంతవారు పొరుగువారిని అనుసరించతమే బాధ్యతల బారంగా బావించాల్సి వస్తోందీ. అందుకే దూరంగా ఉంటూ వారిని మంచిగానే చూడొచ్చనే ఆలోచనతో ముందుకు వెళుతున్నా. అవును వాడు చెప్పిన దాంట్లో నిజం ఉందనిపించింది. అందుకే నేనూ వాడిలాగే కొంచం దూరంగా వెల్లాలనే అలొచనతో ఇంతవరకు పడిన కష్టాలను గుర్తుతెచ్చుకుని వయలుదేరా. నాకు తోడుగా నా కష్టాలను అనుభవించిన నా భార్య కూడా. అలా వచ్చి పది రోజులయ్యిందోలేదో మళ్లీ ఇంటి జ్ణాపకాలు. దీర్ఘంగా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకున్నా. కొన్ని దక్కలంటే మరికొన్ని వదిలేయాల్సిందేనని.
మిత్రుడి జీవితంలోని ఓ సంఘటన నుండి
మేఘన గుండ్ల
<< Home