Wednesday, January 28, 2009

కుమ్ములాటలో తెలుగు 'పాత్రికేయం'







వాస్తవాలను వెలికితీయటంలో ప్రసార సాధనాల పాత్ర అమోఘం. కానీ.. తెలుగు ప్రసార సాధనాలను చూస్తుంటే వ్యాపారాపేక్షతో కుమ్ములాటలే అధికంగా కనిపిస్తున్నాయి. ఒకరిపై మరొకరు.. తిట్ల దండకానికే అధిక ప్రాధాన్యతను కల్పిస్తూ వాస్తవాలు మరుగున పడిపోయేందుకు కారకులవుతున్నారు. ఎందుకీ రచ్చ. కుమ్ములాటలు వదిలి వాస్తవాలను అందిస్తే సరిపోతోంది కదా. ఓ తెలుగు ప్రసార పాత్రికేయమా ఇప్పటికైనా మీ వ్యాపార లబ్ధిని పక్కనపెట్టి జనజీవానానికి పనికివచ్చే వార్తలను అందించటంలో కాస్తంత దృష్టి సారించండి. లేకుంటే మీ వైపు చూసేందుకు కూడా ఔత్స్తాహికులు ఆసక్తి చూపరు.

మేఘనరావ్ గుండ్ల