ఓ చక్కటి మెలోడీ …
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై...
నిను కానలేక ,మనసూరుకోక.పాడాను నేను పాటనై...
నువ్వక్కడ నేనిక్కడ, పాటిక్కడ పలుకక్కడ...
మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా...
ఈ పువ్వులనే నీ నవ్వులుగా ...
ఈ చుక్కలనే నీ కన్నులుగా ...
నునుసిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా...
ఊహల్లో తే లి, ఉర్రూతలూగి...
మేఘాలతోటి రాగాల లేఖ నీకంపినాను..రావా దేవి..
నీ పేరొక జపమైనది, నీ ప్రేమొక తపమైనది...
నీ ధ్యానమే వరమైనది ఏన్నాల్లైనా...
ఉండీ... లేకా......ఉన్నది నీవే...
ఉన్నా కూడా లేనిది నేనే...!
నా రేపటి అడియాశల రూపం నీవే...
దూరాన ఉన్నా ..నా తోడు నీవే...
నీ దగ్గరున్నా నీ నీడ ..నాదే...
నాదన్నదంతా నీవే..నీవే....
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై...
నిను కానలేక , మనసూరుకోక. పాడాను నేను పాటనై
మేఘన.గుండ్ల
మేఘన.గుండ్ల
<< Home