Wednesday, December 31, 2008
Monday, December 29, 2008
Friday, December 26, 2008
నా కనుల పాపలు.. నీ కోసం ఎదురు చూస్తూ...
నిద్రలేని రాత్ర్తులెన్నో గడిపాను..నువస్తావని నిద్రించిన కనుపాపలనడిగా..
మేలుకొలిపిన మెదడునడిగా..ద్రొహినడిగా.. ప్రేమనడిగా.. ప్రెండ్ నడిగా..
ఇదంతా సుత్తే.. మాములుగా కాదు గులకరాళ్ళ డబ్బలా.. ఎందుకంటే నాకు కవిత్వం రాదు. కారణం నేను కవిని కాదు. ఒకటి మాత్రం నిజం మనసు స్పందిస్తే.. కవిత ప్రవాహమై పొంగి పొర్లుతుందంటారుగా.. అలాగే ఇదో నా చిన్న హృదయాన స్పందించిన మనసు కవిత ఇలా ఉంది..
నే కొసం జీవించు.. నీ కోసం మరణించి..నీ కోసం స్పందించు.. నీ కోసం చలించు
ఎందుకంటే..
నీవన్నది నిజం.. నిన్నటి జీవితం వాస్తవం..నీవన్నది సాక్షం.. నెటికి మిగిలిన సత్యం
నిన్న.. నేడే.. పదిలంగా రేపటి వెలుగుల కోసం నిరీక్షణం.
గడిచిన కాలాన్ని గుండెల్లో నింపుకొని కొత్త పెళ్ళి కూతిరిలా ముస్తాబవుతున్న మరో కొత్త సంబరానికి స్వాగతిస్తూ.. ఈ చెత్తను కూడా చదివిన వారికి కృతజ్ణతలు తేలుపుతూ...
అందరికి సరికొత్త సంవత్సర శుభాకాంక్షలు
మేఘన గుండ్ల
Tuesday, December 23, 2008
ప్రపంచంలో అత్యంత సెక్సీ మహిళలు వీరేనంటా..
సామ, ధాన, దండోపాయాలేలాగో, కామ, క్రోధ,మద, మాత్సర్యాలు అలాగేనని చాలామంది ఇప్పటికే అంగీకరించారు. కానీ మనం మాత్రం.. మనసులో భావాలను వెళ్ళడించలేని సామాన్య మానవుడిలాగే ఉన్నాం. ప్రపంచ దశాలను తీసుకుంటే మనసులోని మలినమైన వెళ్లగక్కే అచారం ఉంది. అందుకే హక్కులను వారు శ్వేచ్చగా పొందగలుగుతున్నారు. వారి శ్వేచ్ఛ ఎలాగంటే శృంగారాన్ని సైతం సదారణ విషయమనే బానిలో ఉంటారు.. ఇప్పుడు అంగీకరించక పొయినా మనం కూడా మనసులో అవే భావనలతో ముందుకు వెళుతున్నాం. ఇదంతా ఎందుకంటే ఇటీవల ఓ ఆంగ్ల పత్రిక ప్రంపంచంలోని అత్యంత సెక్సీ మహిళలెవరు అనే అంశంపై చర్చించి కొందరి పేర్లు విడుదల చేసింది ఇందులో పైనున్నారే వారే నిలిచారు. సెక్సీ అంటే శృంగారమే కాదు అంతర్య సౌదర్యం కూడ చూడండి వారిలో అవే కనిపిస్తాయి...
మేఘన గుండ్ల
Monday, December 8, 2008
ఓమన కుట్టి విశ్వసుందరౌతుందా..
మన ఐశ్వర్య తర్వాత విశ్వసుందరి పోటీలంటే భారత్ లో మరింత క్రేజ్ పెరిగింది. అనంతరం సుస్మిత, ప్రియాంక, లారా వంటి సుందరీమణులు విశ్వ కిరీటంలో నెగ్గినా ఇశ్వర్యలా పెద్దగా క్లిక్ కాలేకపోయారు. అయితే మళ్లీ అటువంటి అందాల భరిణ పార్వతీ ఒమనకుట్టన్ రూపంలో ఈ ఈ ఏడాది విశ్వ కిరీటంపై ఆశలు మోపటం భారతీయ రస హృదయాల్లో కొత్త పుంతలు తొక్కిస్తోంది. పోటీకి ఇంకా కొద్ది రోజులే ఉండటంతో అంటా ఆశక్తిగా చూస్తున్నారు. మరి మన ఓమనకుట్టన్ విశ్వసుందరమైన ఆశలను నిలబెడతారా.. అంతా మంచికే అనుకుందాం.. బెస్ట్ ఆప్ లక్ ఓమన..
మేఘన గుండ్ల