నిండు మనిషీ... నీకు సలాం..
దాహానికి జలానిచ్చి..హరితాంధ్రపు వనానిచ్చి..
రైతుకోసం రుణానిచ్చి.. చెనేతకు సాయమిచ్చి..
గుండెకోసం జీవమిచ్చి.. బతుకుకోసం బలానిచ్చి..
నడచివచ్చి.. నడక నేర్పి.. నింగికెగిరే నీడచూపి..
కాడిపట్టి.. నాడిపట్టి.. జనహృదయంలో గూడుకట్టి..
చిరునవ్వి చిరుదీపాలు వెలిగించి..
నిన్న ఉన్నావ్.. నేడులేవంటున్నావ్..
ఎలా నమ్మను నీవు లేవని..
నిన్న కాదు నేడుకాదు.. నేవిన్నది నిజం కాదు..
జనం పలికారు జేజేలు.. వారి గుండెల్లో ఉన్నావ్ నూరేళ్లు..
జనహృదయ నేత.. జలయజ్ణ ప్రధాత..
జనహృదయ నేత.. జలయజ్ణ ప్రధాత..
హరితాంధ్రప్రధాత నీకు సలాం..
చరిత్రలో నీవున్నావ్ అదే ఊహకు లాల్ సలాం..
మేఘన గుండ్ల