హాయ్.. నే బాగున్నా.. మరి నువ్వో..
మేఘన గుండ్ల
ఈ మధ్య విడుదలైన కొన్ని చిన్న సినిమాలు నిర్మాతలను గట్టెక్కించటమే కాకుండా వటిల్లో నటించిన వారికి కొంచం పేరు కూడా తెచ్చిపెట్టాయి. దీంతో చిన్న సినిమాల సీజన్ ప్రారంభమైంది. తెలుగు సినీ పరిశ్రమ చిన్న సినిమాల విజయాలతో కాస్త ఊపిరి పీల్చుకుంటుండటంతో ఇదే శుభతరుణంగా భావించిన పలువురు చిన్న నిర్మాతలు తమ చిత్రాలను విడుదల చేసేందుకు సిద్దమయ్యారు. ఈ వరుసలోనే ఈవారం ఏకంగా నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయి.
అష్టా చెమ్మా
గ్రహణం చిత్రం ద్వారా ఉత్తమ చిత్ర దర్శకుడిగా మన్ననలు పొందిన మోహనకృష్ణ ఇంద్రగంటి రూపొందించిన చిత్రమిది. ఇందులో మా టీవీలో కలర్స్ ప్రోగ్రాం ద్వారా సుపరిచితమైన స్వాతి హీరోయిన్ గా, కొత్త కుర్రాడు నాని హీరోగా నటించారు. పూర్తి స్థాయి అహ్లాదం ఈ చిత్రంలో ఉంటుందని అందుకే అష్టా చెమ్మా అనే పేరుపెట్టినట్లు దర్శకుడు అన్నారు. అన్నట్లు స్వాతి ఈ మద్య కాలంలో తమిళంలో నటించిన "సుబ్రమణ్యపురం" తమిళ నాట భారి విజయాన్నే నమోదు చేసుకుండి. అంతేకాదు ఈ చిత్రంలోని "కంగళిరుందాళ్..." అనే పాట కుర్రకారు గిలిగింతలు పెట్టి ప్రస్తుతం ఎవరివద్ద చూసిన ఈ పాటే రింగ్ టోనై కూర్చుంది. అంతేకాదు తమిళ యువత మదిలో స్వాతి కిరణం అయ్యింది.
బ్యాంక్
కొంతకాలంగా విడుదలకు నోచుకోక ఎట్టకేలకు విముక్తి పొందుతున్న చిత్రం బ్యాంక్. ఇప్పటికే ఈ చిత్రం విడుదలను పలుమార్లు ప్రకటించి వెనక్కు తగ్గిన నిర్మాతలు చివరిగా ఈ శుక్రవారం తాడోపేడోకు సిద్దమయ్యారు. ఇక ఈ చిత్రంలో బాలివుడ్ నటుడు జాకీష్రాప్, అబ్బస్, అర్చన(వేద) నటించగా దివంగత రఘువరన్ ప్రధాన భూమికను పోషించిన చివరి చిత్రం ఇదే.
అంకిత్ పల్లవి అండ్ ప్రెండ్స్
హ్యాపీడేస్ చిత్రం ద్వారా పరిచయమైన అఖిల్, కొత్త తార అక్ష, హరి ఎల్లెటి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. కాలేగ్ వయస్సులో యువతలోని భావాలకు అనుగునంగా ఈ చిత్రం ఉంటుందని నిర్మాతలు ప్రారంభం నాడే చెప్పారు. శిక్రవారం విడుదలవుతిన్న ఈ చిత్రం ఆడియోకు మంచి స్పందనే రావటంతో సినిమా కూడ విజయం సాధిస్తుందనే ఆకాంక్షను చిత్ర యూనిట్ వెలిబుచ్చారు.
స-రో-జ
తమిళ్ లో చెన్నై-28 వంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన చిత్రం స-రో-జ. నలుగురు కుర్రాళ్ల జీవితంలో ఒక రోజు చోటు చేసుకున్న సంఘటన ఆదారంగా తెరక్కెక్కిన సినిమా ఇది. ఇందులో శ్రీ హరి ప్రధాన భూమికను పోషించగా ప్రముఖ దర్శకుడు కోదండ రామిరెడి కుమారుడైన వైభవ్ హెరోగా, కాజల్ హీరోయిన్ గా, ఎస్పీ చరణ్, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ చిత్రాన్ని పిరమిడ్ సాయిమిర ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తోంది.
మేఘన గుండ్ల