Saturday, August 30, 2008

కొన్ని కబుర్లు...(అవి ఇవి అన్నీ)





కొద్దిసేపు మౌనంగా ఉంటే... ఎన్నో ఆలొచిస్తే. బుర్ర కూడా పాడవుతుంది. అలా కాకుండా అవి ఇవి అన్ని తెలుసుకుంటే కాస్త ఉపశమనంగా ఉంటుంది. ఇదో సిల్లీగా ఇలా కొన్ని చదివితే ఇంకా... మరి మీ ఇష్టం..?


లోకేష్, బ్రహ్మణిని వివాహంతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, నటుడు బాలకృష్ణ వియ్యంకులై తెలుగుదేశానికి పునరుత్తేజం తీసుకురావాలని కలలు కంటున్నారు. మరి నిజమవుతాయా... వెయిట్ చేయాలిమరి..?


ప్రజారాజ్యం పార్టీ పేరుపై కడప జిల్లా వాసి నుంచి వచ్చిన హక్కుల అంశం ఇరువర్గాల చర్చల ద్వారా సుఖాంతం కావటం చిరంజీవి ఊపిరిపీలుకునేలా చేసింది. అయితే దీనిద్వారా కడప జిల్లా వాసి ఏమేరకు లాభపడ్డారో... ష్.. గప్ చిప్..?


బాలకృష్ణ, చంద్రబాబు వియ్యంకులైతే మేమేమైన తక్కువ తిన్నమా అంటూ వైఎసార్, మొహన్ బాబు అనుకున్నటున్నారు. వారు త్వరలో వియ్యంకులు కావటానికి అన్ని ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఇదే మరి అసలు రాజకీయమంటే.. ఏమంటారు.. సార్లూ...?


లక్ష్మీ కళ్యాణం చిత్రం ద్వారా పరిచయమైన కాజల్ ఆరంభ అంత శుభం పలకకపోయినా చందమామ తర్వాత యమా స్పీడ్ గా వెళుతోంది. వరుస చిత్రాలతో గ్లామర్ కు సైతం సిద్దమంటున్న ఈ భా నా నాజూకు అందానికి యోగానే కారణమని చెపుతోంది. బలేగా చెప్పిందికదా..?


యోగా మస్టర్ నుంచి హీరోయిన్ అయిన అనుష్క అందాల ఆరబోతలో ముందుండటం బాగానే లాభించింది. వరుస చిత్రాలతో యమా జోరుగా అందాలు ఆరబోస్తుందో రాబోయే చిత్రాలు చూస్తే అర్థమవుతుంది. ఇంకేం.. కుర్రకారుకు కనుల పండుగే..?


సానియా... హలో టెన్నిస్ స్టార్ అనుకునేరు హ్యాపీడేస్ లోని శ్రావ్స్ అదే సానియా ఆ చిత్రంతో పిల్మ్ పేర్ అవార్ద్ కొట్టేయటమే కాకుండా హీరోయిన్ గా అవకాశాలు చేజిక్కించుకుంది. వినాయాకుడు చిత్రం ద్వారా సాని నిలదొక్కుకునే ప్రయత్నం ఆ విఘ్న రాజే తీర్చాలిమరీ..?


ఉల్లాసంగా.. ఉత్సాహంగా... చిత్ర హీరోయిన్ స్నేహా ఉల్లాల్ అలాగే ఉంది. నిన్ను చూస్తే ఐశ్వర్యలా ఉన్నావని ఓ ప్రముఖ దర్శకుడన్నారట. అయన నోటి పుణ్యమో లేక అదృష్టమోగాని అమెను అందరు ఐశ్వర్యా అంటూ పొగుడుతూ అవకాశాలు కూడా ఇస్తున్నారు. కలిసొస్తే ఇంతే.. స్నేహా.. సారీ అచ్చు ఐశ్వర్యా బెస్ట్ ఆఫ్ లక్.


ఇప్పటికే న్యూస్ చానళ్ల హడావుడితో చస్తున్న తెలుగు ప్రజలు తలపట్టుకునే ప్రమాదం వస్తుందని వార్తలు వస్తున్నాయి. కారణమేంటని ఆరాతీస్తే వచ్చే నాలుగైదు నెలల్లో మరో 9 చానళ్లు రాబొతున్నాయట. ఉన్న చానళ్లతో చస్తుంటే వచ్చే చానళ్ల హడవుడి ఎలా ఉంటుందో అన్నదే తెలుగు వారి భయం.. ఆలోచించాల్సిన విషయమే...?

మేఘన గుండ్ల

రంగులకలగా "శ్రీకృష్ణ తులాబారం"



అలనాటి బ్లాక్ అండ్ వైట్, ఈస్ట్ మన్ కలర్ సినిమాలు త్వరలో సప్తవర్ణాల శోభను సంతరించుకోనున్నాయి. ప్రదానంగా ఎన్ టీఆర్ నటించిన పౌరాణిక అణిముత్యాలైన చిత్రాలను రంగుల్లోకి మార్చేందుకు ప్రముఖ నిర్మాత రామానాయుడు యత్నిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రయత్నాలు విజయవంతం చేస్తామని రామానాయుడే స్వయంగా చెప్పారు. అంతే కాకుండా కొన్ని పాత చిత్రాలను చిత్రాలను పునర్నిర్మించనున్నట్లు ఆయన వెళ్లడించారు.


ఎణ్ టీఆర్, జమున తదితరులు నటించిన అలనాటి అణిముత్యం శ్రీకృష్ణ తులాభారం బ్లాక్ అండ్ వైట్ లో బ్లాక్ బస్టర్ మూవీగా 40 ఏళ్ల కిందటే అఖండ విజయం సాధించింది. ఇటీవల కాలంలో పౌరాణిక, జానపద, భక్తి రస చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. దీంతో అలనాటి అణిముత్యాలను నేతి తరాల వారికి చేరువచేసే ప్రయత్నంలో కొందరు నిర్మాతలు తలమునకలయ్యారు. ప్రధానంగా కొన్ని బ్లాక్ బస్టర్ చిత్రాలను మేగా నిర్మాత రామానాయుడు పునర్నిర్మించటంతో పాటు పౌరాణిక ఈస్ట్మన్ కలర్ చిత్రాలకు రంగుల శోభను తీసౌకు రావాలని నిర్ణయించారు. శ్రీ కృష్ణ తులాబారం వంటి చిత్రాన్ని రంగుల్లోకి మార్చి రాష్ట్ర వ్యాప్తంగా మరోమారు విడుదల చేసే పనుల్లో అగ్ర నిర్మాత రామానాయుడు నిమగ్నమయ్యారు. ఇందుకు సంబందించి ముంబైలోని ఆయా రంగాల సాంకేతిక నిపుణులతో చర్చించిన రామానాయుడు శ్రీకృష్ణ తులాబారం, మాయాబజార్ వంటి ఘన విజయం సాధించిన చిత్రాలను రంగుల్లోకి మార్చనున్నట్లు చెప్పారు.


దీంతోపాటు ఎన్ టీఆర్ సురేష్ ప్రొడక్షన్ పతాకంలో నటించిన రాముడు భీముడు చిత్రాన్ని రీమేక్ చేసే ప్రయత్నాలలో ఉన్నట్లు రామానాయుడు తెలిపారు. ఎన్ టీఆర్ ద్విపాత్రాభినయంలో నటించి అప్పట్లో సంచల విజయం సాధించిన రాముడు భీముడు చిత్రాన్ని ఎన్ టీఆర్ మనవడైన జూనియర్ ఎన్ టీఆర్ తో పునర్నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నట్లు రామానాయుడు తెలిపారు. శాతాధిక చిత్రాల నిర్మాతగా గిన్నిస్ బుక్ ఆప్ రికార్డ్స్ లో స్థానం సంపాధించిన రామానాయుడు అలనాటి చిత్రాలకు రంగుల శొభను అద్దటంతో పాటు, కొన్ని చిత్రాలను రేమేక్ చేయటం ద్వారా కూడ అంతర్జాతీయంగా తమ బ్యానర్ కు గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.


మేఘన గుండ్ల

Friday, August 29, 2008

నాకు నచ్చింది... "కూచిపుడి"





సంస్కృతి, సాంప్రదాయాలకు ఆలవాలమైన మన రష్ట్రానికి గుర్తిపు తెచ్చిన కళలెన్నో ఉన్నాయి. ఇందులో ప్రదానంగా భరతీయ నాట్యాలలో నతస్థానంలో ఉన్న కూచిపుడి ప్రధానంగా చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని మారుమూల ప్రాంతమైన కూచిపుడి అనే ఊరిలో పుట్టిన భారతీయ ఆంప్రాదాయ నృత్యానికి ఆ ఊరి పేరే స్థిరపడింది. శాస్త్రీయ సంగీతానికి అనుగునంగా రాగ, తాళ, భావ యుక్తంగా, పాదాలు పదముల అందెల రవములుగా అద్వితీయ విన్యాసంగా వెలుగు చూసిందే కూచిపుడి.


భరత నాట్యానికి భిన్నంగా 17వ శతాబ్ద కాలంలో సిద్దేంద్ర యోగి కూచిపుడిలోని కుర్రకారుకు డ్రామాలలో నాట్యంగా దీనిని నేర్పించే వారట. అలా ఈ నృత్యం చక్కని సంప్రదాయ, దైవాంశకరంగా ఉండటంతోపాటు అందరి మన్ననలు పొందటంతో సిద్దేంద్ర యోగి కూచిపుడిలో పుట్టిన ఈ నాట్యానికి కూచిపుడి అని పేరును పెట్టారు. తదనంతరం ఈ నృత్యం ప్రపంచ నలుదిక్కుల వెలుగు చూసేందుకు ఎందరో కృషిచేశారు. ఈ నృత్యం వెలుగు చూసిన అంతి కాలంలోనే భారతీయ నట్యాలలొ ఒకటిగా స్థనం సంపాదించుకుంది. కూచిపుడి నట్యంలో భామా కలాపంతొపాటు నృత్య రూపకాలు ప్రపంచ ప్రసిద్ది చెందాయి. ఆరంభంలో దేవదాశీల నుంచి సినిమాల్లో నృత్యాల వరకు ఈ నత్యం పరసిద్ది చెందింది.


ఈ నృత్యాభినయం ఆషామాషి కాదు. నిష్టతొ, నిబద్దతతో, తపస్సుల అభ్యసిస్తెనే ఈ నాట్యం యొక్క పూర్తి అర్థం, పరమార్థం అవగతమవుతుంది. ప్రదనంగా ఈ కలలో కరములు, పాదాల భంగిమలకు ప్రత్యేక అర్థం ఉమది. ముఖ్యంగా అసమ్యుత హస్తంలో 24 కర భంగిమలు, సమ్యుత హస్తంలో 12, నృఇత్త హస్తంలో 30, స్తానకాస్ లో ఆరు భంగిమలు, పదబేదలలో ఆరు, బౌమిచారిలో 16, ఆసిక చారిలో 16 భంగిమలు ప్రదానమైనవి. ఈ నాట్యానికి సంగీతం కూడ అతి ప్రదానం.

భామా కలాపం


కూచిపుడి నాట్యాన్ని రూపొందించిన సిద్దేంద్ర యోగి ఆరంబ కాలంలోనే నృత్య రూపకాలను ప్రదర్శించేవారు. ప్రధానంగా కృష్ణ పరమాత్ముడు, సత్యభామల నడుమ సాగే సరస సల్లాపాలను సిద్దేంద్ర యోగికూచిపుడి నాట్యాన్ని గొల్లకలాపం పేరుతో ప్రత్యేక నృత్య రూపాన్ని ఇచ్చారు. అదే తదనంతరం భామా కలాపంగా ప్రపంచ ప్రక్యతిగాంచింది. సత్యభామ విరుపులు, వయ్యారాలు కూచిపుది నాట్య హావభావాలలో ఒక క్రేజును సృష్టించింది. కథకళిలో యక్షగానంలా కూచిపుడిలో భామాకలాపం స్థిరపడిపోయింది.


ఎందరో మహానుభవులు


ఈ కళ ప్రాపంచ వ్యప్తం కావటానికి ఎందరో మహానుభావులు కృషిచేశారు. సిద్దేంద్ర యోగి తర్వాత చింతా వెంకటరామయ్య, వెంపటి వెంకటనారాయణ, వేదాంతం లక్ష్మి నారాయణ స్వామి, మాదవయ్య హరి, తాడేపల్లి పేరయ్య, వేదాంతం రాఘవయ్య, పసుమర్తి సుబ్రమణ్య శాస్త్రి, పసుమర్తి కృష్ణమూర్తి, మహాకాళి చిన సత్యనారాయణ, వెంపటి చిన సత్యం, రాజా రెడ్డి, రాధా రెడ్డి, మంజులా నాయుడు, మంజు భార్గ్గవి తదితర ఎందరో కూచిపుడిని విశ్వవ్యాప్తం చేశారు.



పద్మభూషన్ వెంపటి చిన సత్యం గారి సహకారంతో... మేఘన గుండ్ల

జగమంత కుటుంబం నాది...



ఇదో కృష్ణవంశి దర్శకత్వంలో ప్రభాస్ నటీంచిన "చక్రం" చిత్రంలోని ఈ పాట ఎప్పుడో విని ఉంటారు. నిత్యం మానసిక సంఘర్షణల నడుమ జీవితాన్ని ఈడ్చుతున్న మనలాంటి వారికి ఇది చక్కగా సరిపోతోందన్నది నా అభిప్రాయం. ఎప్పుడో వచ్చిన ఈ పాటకు నీ అభిప్రాయం ఎవడికి కావాలని అనకండి. ఎందుకంటే సమస్యలతో సతమతమయ్యే ప్రతివ్యక్తి వినాల్సిన ఈ పాటను ఓ బ్లాగర్ మిత్రుడు ఈ మద్య వెలువరిచాడు. ఎందుకో తెలీదు కానీ వెంటనే ఆ పాటను పదిసార్లకు పైగానే చదివుంటా. అందుకే ఇంత చక్కటి పాటే కాదు ఇందులోని ప్రతి పదం... జగమంతా విస్తరించిన తెలుగు లోగిలికి చేరాలన్నది నా ఆశ. చేసే ప్రయత్నం విజయం సాధిస్తుందా..? అనే విషాయాన్ని నేనసలు పట్టించుకోను. సంఘర్షణల నడుమ కొట్టుమిట్టాడే ప్రతి తెలుగు గుండెను స్పందించ గలిగిన ఈ పాటను చదివి లేక ప్లేయర్ లో విని ఆశ్వాదించితే చక్కటి మానసిక ఉపశమనం దొరుకుతుందని నా ఆకాంక్ష. ఇదుగో పాట...

జగమంత కుటుంబం నాది – ఏకాకి జీవనం నాది
సంసారసాగరం నాదే – సన్యాసం, శూన్యం నావే
కవినై, కవితనైభార్యనై, భర్తనై
మల్లెలదారిలో, మంచు ఎడారిలో
పన్నీటి జయగీతాల, కన్నీటి జలపాతాల
నాతో నేనే అనుగమిస్తూ, నాతో నేనే రమిస్తూ,
ఒంటరినై అనవరతం, కంటున్నాను నిరంతరం
కలల్ని, కధల్ని, మాటల్ని, పాటల్ని, రంగుల్ని, రంగవల్లుల్ని,
కావ్యకన్యల్ని, ఆడపిల్లల్ని
మింటికి కంటిని నేనై, కంటల మంటను నేనై,
మంటలమాటున వెన్నెల నేనై, వెన్నెలపూతల మంటను నేనై
రవినై, శశినై, దివమై, నిశినై
నాతో నేనే సహగమిస్తూ, నాతో నేనే రమిస్తూ,
ఒంటరినై అనవరతం, కంటున్నాను నిరంతరం
కిరణాల్ని, కిరణాల హరిణాల్ని, హరిణాల చరణాల్ని, చరణాల చలనాల గమ్యాన్ని,
కాలాన్ని, ఇంద్రజాలాన్ని

గాలి పల్లకిలోన తరలి నా పాటపాప ఊరేగి వెడలె
గొంతు వాకిలిని మూసి మరలి మూగవోయి నా గుండె మిగలె
నా హృదయమే నా లోగిలి – నా హృదయమే నా పాటకు తల్లి
నా హృదయమే నాకు ఆలి – నా హృదయములో ఇది సినీ వాలి

మేఘన గుండ్ల

Thursday, August 28, 2008

50వ వసంతంలో మన్మధుడు...



50 వసంతాల వడిలో అడుగుపెడుతున్న నవ మన్మధుడైన నాగార్జున జన్మదిన శుభాకాంక్షలు అందిద్దాం. నవరస నటనా కౌశల్యంతో మరెన్నో శిఖరాలను అధిరోహించాలని అభినందిద్దాం. ఇంకా వందేళ్లు ఆయురారోగ్యాలతో, విజయాలతో ముందుకు సాగాలని ఆశిద్దాం.


యువ సామ్రాట్ నాగార్జున నటిస్తున్న కొత్త చిత్రం కింగ్. శ్రీను వైట్ల దర్శకుడు. ఎప్పటిలాగే సొంత బ్యానర్ లాంటి కామాక్షి మూవీస్ శివప్రసాద్ రెడ్డి నిర్మాత. వెరైటీని కోరుకునే నాగార్జున ఇటీవ కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుడుతూ తన అభిమానులనే కాకుండా మంచి సినిమాలను చూసే కుటుంభాలను సైతం థియేటర్లకు రప్పిస్తారని నిర్మాతలు కాస్తా అయానపై నమ్మకం పెట్టుకుంటున్నారు. అసలే చార్మిగ్.. స్టైలీష్.. హేరో అయిన నాగార్జున మన్మధుడు చిత్రంతో చేసిన అల్లరి యువత ప్రదానంగా అమ్మాయిలు ఇంకా మర్చిపోలేదు. ఆ చిత్రం ద్వారా యుక్త వయసులో ఉన్న అమ్మాయిలంతా ఇదో మన్మధుడు వంటి వరుడు కావాలని కొరుకున్నారంటే ఆ చిత్రం ఎంతగా యువ హృదయాలలో దూసుకుపోయిందో చెప్పొచ్చు. అటువంటి రొమాటిక్ లవ్ స్టోరీలను చేసి మెప్పించిన నాగార్జున అంతకు ముందే భక్తి.. ముక్తి రస ప్రదానమైన పాత్రల్లో కనిపించి అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. మన్మధుడు తర్వాత కూడా యాక్షన్, సెంటిమెంట్ చిత్ర ద్వార అందరి మన్ననలు పొందాడు. ఈ నేపధ్యంలో ఇటీవల చేసిన డాన్ చిత్రానికి భిన్నంగా అటు మాస్, ఇటు క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు కొత్తగా ఇదో "కింగ్" అవతారం మొదలు పెట్టాడు. సింగ్ అంగానే నాగార్జున కొత్తగా ఏదో చేస్తున్నాడని ప్రేక్షకులు అనుకోవటం మామూలే అయితే ఇందులో ట్విస్ట్ ఏముంటుంది. కాని ఈ ట్విస్ట్ అంతా దర్శకుడైన శ్రీను వైట్లలోనే ఉండి. లవ్, మాస్, మసాల, కామెడి పంచ్ లు ఇవ్వటంలో దిట్టైన శ్రీను వైట్ల నాగార్జునతో చిత్రం చేస్తుండటమే కొత్త పంచ్. ఇటీవల విడుదలైన కింగ్ పోస్టర్లు, స్టిల్ల్స్ చూసిన వారికి నాగార్జున కొత్త లుక్ లో కనిపించటమే అసలు కారణం. కింగ్ అంటూ గన్ లు పట్టుకుంటూనే మన్మధుడిలా పోజు కొడుతుండటమే ఇందులో కొత్తదనం. ఈ స్టిల్స్ చూస్తుంటే మీరు కూడ కింగ్ అయిన నాగార్జున మన్మధుడిగా మరొ మారు దర్శన మిస్తాడని అనుకుంటారు. అయితే ఈ చిత్రంలో నాగార్జున మన్మధుడు.. లేక కింగా అన్నది మాత్రం సినిమా విదుదలయ్యకే తెలియాలి మరి..!
మరిన్ని వివరాలకు http://www.nagtheking.com/ చూడండి.

50 వసంతాల వడిలో అడుగు పెడుతున్న నాగార్జునకు మేఘన సంజయ్ గుండ్ల హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అందిస్తోంది. హ్యాపీ బర్త్ డే నాగార్జున.

చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ





ఒకరు మెగాస్టార్ గా వెలిగి తెలుగుతెరపై వెలుగువెలిగిన హీరో.. మరొకరు నటసార్వబౌముడిగా విశ్వనట చక్రవర్తి అయిన దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం ఆవిర్భవనేత ఎన్ టీఆర్ కుమారుడు, నటుడు... ఇరువురు తెలుగు సినీ కళామ తల్లికి ముద్దుబిడ్డలే. ఇద్దరూ ఉద్దండులే.. కలిసి మెలిసి తిరిగిన ఈ కళాఅకారులు త్వరలో కాలు దువ్వేందుకు సన్నద్దమవుతున్నారు. చిరంజీవి ఏకంగా ప్రజారాజ్యాన్ని స్థాపించగా, బాలకృష్ణ తన తండ్రి పెట్టిన తెలుగుదేశానికి కొత్త ఊపిరి పోసేందుకు సిద్దమవుతున్నారు. సినిమాల జయాపజాయాలతో పరిశ్రమ ఒడుదుడుకులను ఎదుర్కొంటున్నా మంచి ఆహ్లాద వాతావరణాన్ని అందిస్తూ ముందుకు సాగుతున్న తరుణంలో రెండు భిన్న దృవాలు రాజకీయలలో కాలు దువ్వేందుకు సిద్దమవుతుండటం సినీ వర్గాన్ని దిగ్బ్రాంతికి గురిచేస్తోంది. వీరి రాజకీయ భవిష్యత్తు ఎలా ఎదుగుతుందో తెలియదు కాని ఇద్దరు మహా కథానాయకులు రాజకీయ రంగ ప్రవేశం చేయటం వారి అభిమాన వర్గాలను ఇరుకున పెడుతోంది.
తిరుపతిలో జరిగిన మహా సభ ద్వారా చిరంజీవి రాజకీయారంగేట్రానికి తెరతీయగా, గుంటూరులో జరగనున్న టిడిపి యువ ఘర్జన సభ ద్వారా బాలకృష్ణను ప్రజారాజ్యం పార్టీకి ధీటుగా తీసుకు రావాలని కొందరు సీనియర్ నేతలు ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి చిరంజీవి ద్వారా టిడిపి ఏ మేరకు నష్టం వాటిల్లిందో అంచనా వేస్తున్న నేతలు నష్టాన్ని పూడ్చుకోవటంతో పాటు పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్ టీఆర్ కుటుంభం మొత్తం తమతో ఉందని నిరూపించుకొని తద్వారా వచ్చే ఎన్నికల్లో లాభ పడాలని యోచిస్తున్నారు.
సొంత పార్టీ ఏర్పాటు ద్వారా రానున్న ఎన్నికల్లో విజయదుంధుభి మోగించి మరో మారు రాష్ట్రంలో కొత్త రాజకీయాలను వెలుగు చూపించాలని చిరంజీవి బావిస్తున్నారు. ఇందులో భాగంగానే తనకున్న ప్రజా భలం ఏపాటిదో పరీక్షించేందుకు తిరుపతి సభను ఉపయోగించుకున్నట్లు తెలిసింది. అంతే కాకుండా ఎన్ టీఆర్ దారిలోనే తమ పార్టీ మనుగడను కొనసాగించేలా అట్టడుగు వర్గాల బాట పట్టినట్లు చిరు రాజకీయారంగేట్ర సభ నిరూపించినట్లు విశ్లేషకులు సైతం అంటున్నారు. తద్వారా చిరంజీవి ప్రజల నాడిని పట్టుకునేందుకు అధిక ప్రాదాన్యతిస్తూ రాష్ట్ర పర్యటన చేయాలని యోచిస్తున్నారు. అంతే కాకుండా తన పార్టీని బలోపేతం చేసుకునేందుకు వివిద పార్టీల్లోని సీనియర్లను తమ ప్రజారాజ్యంలో చేరాలని స్వాగతిస్తున్నారు. ఇప్పటికే వేర్వేరు పార్టీలకు చేందిన పలువురు సీనియర్లతో రహస్య సమావేశాలు నిర్వహించిన చిరంజీవి సమయానుకూలంగా వారిని పార్టిలో చేర్చుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది.
ఎన్ టీఆర్ స్థాపించిన తెలుగుదేశంలో ఆయన కుటుంభీకుల పాత్ర తక్కువేనని చెప్పొచ్చు. బాలకృష్ణ సోదరుడైన హరికృష్ణ ఒక్కరే తెలుగుదేశంలో కీలక భూమికను పోషిస్తుండగా వీరి సోదరి పురందరేశ్వరి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఇక బాలకృష్ణ కూడ ఓమారు ఎన్నికల ప్రచారం చేసినా వేదికలెక్కిన సందర్బం లేదు. ఈ నేపధ్యంలో చిరంజీవి పార్టీ, అధికార కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి తెలుగుదేశానికి పూర్వ వైభవాన్ని తెప్పించాలన్నది చంద్రబాబు ప్రయత్నం. అందుకు ఎన్ టీఆర్ కుంటుంభాన్ని తెరపైకి తీసుకు రావటమే సరైన నిర్ణయంగా తెలుగుదేశం భావిస్తోంది. మరో వైపు కుటుంభాలపరంగా మనస్పర్థలున్నా అన్నింటిని మరచి నందమూరి వంశస్తులనందరినీ ఒకే తాటిపై తెచ్చె ప్రయత్నాలు కొంతకాలంగా జరిగాయి. ఏదయితేనేం రాజకీయంగా తమ తండ్రి స్థాపించిన తెలుగుదేశానికి పూర్వ వైభవాన్ని తీసుకురావాలనే పట్టుదల నందమూరి వంశంలో వచ్చింది. ఇందులో భాగంగానే బాలకృష్ణ, జూనియర్ ఎన్ టీఆర్, కల్యాణ్ రాంతో పాటు నందమూరి కుటుంభాన్ని గుంటూరు వేధికపైకి తీసుకురావాలని తెలుగుదేశం ప్రయత్నిస్తోంది.
నందమూరి వంశీయులు గుంటూరు వేధిక ఎక్కితే వచ్చే ఎన్నికల్లో జరిగే రాజకీయ పోరు చిరంజీవి ప్రజారాజ్యం, బాలకృష్ణ తెలుగుదేశం నడుమే దిగ్గజాలు డీ కొట్టినట్లుగా ఉంటుందని విశ్లేషకుల భావిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా ఈ రెండు పార్టీల వ్యవహారాన్ని సునిశితంగా పరిశీలిస్తూనే తమ వైపు నుంచి కూడా సినీ తారలను రంగంలోకి దింపేందుకు సన్నాహాలు చేస్తోంది. దీని ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల చిత్రం మహా సంగ్రామాన్నే సృష్టిచే అవకాశాలకు తెరతీస్తోంది. 1983 తర్వాత త్వరలో జరగనున్న ఎన్నికలు మరో మారు ఆంధ్రరాష్ట్ర రాజకీయలకు కేంద్ర భిందువు కానుంది. ఇక తారల పోరా... రాజకీయ హోరా అన్నది రానున్న ఎన్నికల ద్వారా నిర్ణయించుకోవాల్సింది ప్రజలే.
రచన : మేఘన గుండ్ల

Wednesday, August 27, 2008

సినిమావొళ్లంతా...




పొద్దున మా అవ్వ(అమ్మమ్మ)కు ఫోన్ చేశా. అరే పెద్దొడా.. ఆ సినిమా అయనున్నాడే అదేరా సిరంజీవి పార్టీ పెట్టిండటగా నీకు తెలుసారా. ఆ తెలుసే అయితేంటీ అన్నా?. ఏం లేదురా గప్పుడెప్పుడో ఎన్ టోడు (ఎన్ టీఆర్)తెలుగు దేశం పెట్టి మన ఊరుకొచ్చిండు. మాతో సక్కగా మాటాడిండు అందుకే మేమంతా ఆయనకే ఓటేసాం. మగానుబావుడు రెండు రూపాయిలకే బియ్యం, ఇస్కూలు పిల్లలకు అన్నం, ఉంటానికి ఇల్లూ ఇచ్చిండు. ఆ తర్వాత శానా మంది సినిమావొళ్లు పార్టీల్లోకి వచ్చిన ముకం కూడా చూపించలేదు. మళ్లీ శానాళ్లకి ఇప్పుడు సిరంజీవి పార్టీ పెట్టిందు. ఈనేమో పెజలు అంటూ ఎన్ టోడి మాటలు మాటాడిందు. నిజంగా ఎన్ టోడిలా మన ఊరొస్తాడా?. మాతో మాటాడతాడా?. అయినా ఎన్ టోడి బుద్ది వీళ్లకుందా. ఉన్నదంతా తనోళ్లకు దాసుకునే ఈ సినిమావొళ్లంతా పార్టీలు పెట్టి మనకేం సేస్తారట. అంటూనే అయినా సిరంజీవి మాటలు మళ్లి ఎన్ టోడిలా ఉన్నాయిరా. నమ్మి ఓటెయ్యచ్చంటావా అంది. అంతే నాకు చిర్రెత్తుకొచ్చినా సినిమావోళ్లు అంటూనే మాటలు బాగున్నయని ఓటేస్తానని అన్న మా అవ్వ మాటలతో ఆలోచన్లో పడ్డా. మా అవ్వలాంటి వారెందరో నిజంగా మనకు మంచి జరుగుతుందని నమ్ముతూ ఓటేస్తాననటంలో వారికున్న నమ్మకానికి హ్యాట్సాఫ్ చెప్పొచ్చేమో. తధా నమాక్కం విజయం కావాలని ఆకాంక్షిద్దాం.


మేఘన గుండ్ల

"ప్రజా రాజ్యం" సుసాద్యమా..?


ప్రజా రాజ్యం.. భారతావనికి స్వాతంత్ర్యం సిద్దించిన నాటి నుంచి నాయకుల నోట వెలువడుతున్న ఓ రాజకీయ నాటక ప్రక్రియే ఇది. ప్రజల చేతికే పాలనన్న ప్రజారాజ్యం నిజంగానే సిద్దిస్తుందా..? అనేది మహా సంకల్పం.. మహా యుద్దం అంటూ చిరంజీవి ప్రకటించిన ప్రజారాజ్యం పార్టీ ఆవిర్బావం అనంతరం ప్రజలకు మరో సారి వచ్చిన ఆలోచన. మరో సారి ఎందుకన్నానంటే చిరు అంటున్నా ఈ ప్రజారాజ్యం ప్రజలకు చేరువవటం సుసాద్యమా..? అన్న ప్రశ్న సంవత్సరాల తరబడి వారిలో మెదులుతున్న కల కాబట్టి. కలలు కనటం రాష్ట్ర కాదు దేశ అట్టడుగు బలహీన, బడుగు వర్గాల ప్రజానికానికి స్వాతంత్ర్యం నుంచి వచ్చిన హక్కు కాబట్టే కొత్త నాయకులు, కొత్త పార్టీలు వచ్చిన ప్రతిసారి తమకేదో పండగ వచ్చిందన్న సంతోషంలో మునిగి తేలుతుంటారు. అయితే కాలాలు యుగాలు మారినా ప్రజారాజ్యం సిద్దించే అవకాశాలు, మార్గాలు సుసాద్యమనే దోరణే ఉంది.

రాజకీయాలను, నాయకులను, వ్యవస్థను మార్చి తెలుగు వారి అత్మ గౌరవాన్ని కాపాడుతానంటూ కాసులు కురిపించే గ్లామర్ ప్రపంచం నుంచి తెలుగుదేశాధినేతగా అవిర్భవించిన ఎన్ టీఆర్ నిజంగానే అవతారపురుషుడని అంగీకరించాల్సిందే. ప్రజలే దేవుళ్లు అంటూ ఆయన చేసిన ప్రజారాజ్యాభిలాష సామాన్య, అట్టడుగు ప్రజానికానికి చేరేలోగా అవంతరాలు ఏర్పడి ప్రజలు తిరిగి తమ పూర్వ స్థితికే చేరారు. ఎన్ టీఆర్ కు ముందు ఏళ్ళ తరబడి రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రజారాజ్యాన్ని ప్రజలకు కట్టబెట్టడం కలగానే ఉంటుందన్నది వాస్తవం. నాడు ఎలా ఉన్నా నేడు రాష్ట్రాన్ని ఏలే పాలకులు ప్రజలకు కనీసం వారి హక్కులను ఇవ్వటం కల గానే మిగులుతుందన్నది జగమెరిగిన సత్యం. ఈ నేపధ్యంలో మరో మారు చిరంజీవి ప్రజా రాజ్యాన్ని ప్రకటించటం అట్టడుగు వర్గాల వారు తిరిగి తమ కల గుర్తుకు వచ్చింది.

నిజంగా తమకేం కావాలో నిర్ణయించుకుని దానిని పొందాలనుకునే లోగానే మారే ప్రభుత్వాలతో ఏళ్ళ తరబడి సతమతమయ్యే అట్టడు వర్గాలు వాస్తవానికి కోరుకునే ప్రజారాజ్యం ఏమిటి?. కూడు...గూడు...గుడ్డ... ఇవే కదా. ఏ ప్రభుత్వం నుంచైన వారు కోరుకునేది అదే కదా. ఇవి అందించటమే ప్రజా రాజ్యమని భావించే పేదరికానికి వారినుంచి అధికారాన్ని పొందే ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందన్నది జగమెరిగిన మిలియన్ డాలర్ల ప్రశ్న. అధికారం, హోదా, సంపాదన, వారసత్వ రాజకీయం వెరసి లంచగొండితనానికి అలవడిన నేటి రాజకీయాలకు పేదల ఆకలి కేకలు వినిపించక పోవటం ఏళ్ల తరబడి వస్తున్న ఆచారమే. నేటి రాజకీయాల్లో వీటిని మార్చటం సాధ్యమా..?. కష్టసాధ్యం అని నొక్కి వక్కానించొచ్చు.

ఓ నాయుడు గారు.. రెడ్డి గారు.. చౌదరి గారు.., తెలుగుదేశం పార్టీ.. కాంగ్రెస్సు పార్టీ.. తెలంగానా పార్టీ.. బీజేపీ పార్టీ.. అని కులాలు, వర్గాలు, ప్రాంతీయ బేదాలపైనే ఓ సినిమాలో సీనియర్ రచయిత రాసినట్లు ఏ నాయకుడు, ఏ పార్టీకి పేదల కష్టాలపై నిబద్దత లేనప్పుడు ప్రజారాజ్యం సిద్దించటం సుసాధ్యం. మరెలా సాధ్యమవుతుందంటే.. యుద్దం జరగాలి. ఎన్ టీఆర్ పలికిన తెలుగు ఆత్మ గౌరవ పోరాటం మరో మారు వెల్లువెత్తాలి. ధైర్యం, నిజాయితీ, నిబద్దతతో కూడిన ఆత్మ విశ్వాసంతో ప్రతి వ్యక్తి తన వంతు అడుగును ముందుకెయ్యాలి. నిశ్వార్థ సేవాభావంతో చేయిచేయి కలిపి ముందుకు వెళ్లే సైనికులు మరో మారు వెలుగు చూడాలి. అప్పుడే పేద, ధనిక, చిన్న, పెద్ద అనే తేడా లేని ప్రజారాజ్యం వెల్లివిరిసే అవకాశం ఉంది.

నేను సైతం అంటూ మరో నాయకుడిగా చిరంజీవి తెరపైకి వచ్చారు. నేను సైనికుడినే అన్నారు. అంకితభావంతో అందరం కలిసికట్టుగా మనకున్న హక్కులను పొరాడి సాదిద్దాం అన్నారు. ప్రజారాజ్యం ప్రజల చేతుల్లోనే అంటున్నారు. నిజంగానే... యుద్దానికి సిద్దమవుతున్న ఈ సైనికిడిని అభినందించాల్సిందే. అందుకు ఆంధ్రా, తెలంగాణా, రాయలసీమా అంటూ ప్రాంతీయ వాదలను, మాదిగ, మాల, బీసీ, ధనిక వర్గాలు అనే అవసరాన్ని తమకు అనుకూలంగా మారుకునే నేటి కుల వైషమ్యాల రాజకీయాలకు భిన్నంగా ప్రజల చేతికే ప్రజారాజ్యాన్ని చేరువచేసేంత వరకు జన సింధువులోని చిరు బింధువు అంకితమవుదాం. అప్పుడే తెలుగు జాతి ఆత్మ గౌరవంతో పాటు ప్రజల చేతిలోనే తమ సమున్నత భవిత సుసాధ్యమవుతుంది. చెప్పే మాట కన్న చేసే మనస్సే ఆయుధంగా మనం కూడా ప్రజల చేతికే ప్రజా రాజ్యాన్ని అందించేందుకు కృషిచేద్దాం. అప్పుడు ప్రజారాజ్యం సుసాధ్యమే..!!

రచన : మేఘన గుండ్ల

Tuesday, August 26, 2008

చిరంజీవి ప్రజా రాజ్యం


ఎట్టకేలకు చిరు తన ప్రజా రాజ్యం పార్టీ పేరును ప్రకటించారు. ప్రేమే లక్ష్యం, సేవే మార్గంగా లక్షలాది అబిమానుల నడుమ ప్రజల పాలించే పార్టీగా ప్రజారాజ్యం ఉంటుందని వెళ్ళడించారు. తిరుపతిలోని ప్రజా అంకిత వేదిక నుంచి పార్టీని ప్రకటించిన చిరంజీవి వికలాంగుల చేత పార్టీ జెండాను ఆవిష్కరింప చేశారు. భారత జాతీయ పతాకం పొలినట్లుగా ఆకుపచ్చ, తెలుపు రంగుల్లో పసుపు నడుమ ఎరుపు రంగులోని సూర్యుడి గుర్తును ముద్రించిన పాతాకం గురించి చిరంజీవి వివరించారు. ఇప్పటి వరకు ఏలిన ప్రభుత్వాలను విమర్శించిన చిరంజీవి పేదలే తమ రాజ్యాన్ని ఏలే సందర్భాన్ని తీసురావటమే ద్యేయంగా ముందుకు నడుస్తానని ప్రకటించారు.

Monday, August 25, 2008

నేనింతే...(సినిమా కాదు..జీవితం)




అవును నేనింతే అన్నాడు మా నానిగాడు.. మొన్నామద్య వాళ్ళ మమ్మీతో తెగ సీరియెస్ గా అంటున్న ఆరేళ్ళ నాడిగాడి మాటలు నాకు అర్థం కాలేదు. అందుకే ఆ విషయం గురించి పట్టించుకోకుండా నేనూ హిందులో వచ్చిన ఓ ఆర్టికల్ ను సీరియెస్ గానే చదవటం మొదలు పెట్టా. అలా ఆర్టికల్ ప్రారంభించానో లేదో వెనుక నుంచి మా నాని గాడి స్వరం మరో మారు బిగ్గరగా వినిపించటంతో ఇకా లాభం లేదని వాడి సమస్యేంటో తెలుసుకుందామని నిర్ణయించా. అటువైపు తిరిగి అసలు విషయమేంటో తెలుసుకుందామని నాడిగాడిని పిలిచా. వాడు నా వద్దకు రాలేదు సరికదా నేను పిలుస్తున్నాననే ఆలోచనే లేకుండా దీర్ఘంగా ఆలోచిస్తున్న వాడిలా ఓ పోజుపెట్టి వాళ్ళ మమ్మికి ఏదో నచ్చజెప్పాలని ప్రయత్నిస్తున్నాడు. ఇలా కాదని కుర్చిల్లోంచి లేచి వాడి వద్దకు వెళ్ళా. ఏం నాన్న విషయం ఏమిటీ? అంటూ వాడిని చిన్నగా బుజ్జగించాలని ప్రయత్నించా. అయినా వాడు ఇంకా మౌనంగానే ఉండటంతో వాడి మమ్మినీ అడిగా. అప్పటి వరకు వాడితో వాదనకు దిగిన కోపానంతా కంట్రొల్ చేసుకుంటూనే వాడినే అడగండి అంటూ తను వంటగదిలోకి వెళ్ళింది.
దీంతో సరాసరి నాని గాడి వద్దే తేల్చుకుందామని చిన్నగా విషయం రాబట్టే ప్రయత్నం చేసా. విషమేమిటంటే... వాడు ప్రతి విషయాన్ని ఈజీగా తీసుకోవటమే. స్కూలుకు వెళ్ళే దగ్గర నుండి తను వేసుకునే డ్రెస్, తినే తిండి, మాట్లాడే తీరు అంతా పైన హెడ్డింలో రాసామే అదే నేనింతే. నాకు నచ్చిందే చేస్తా. అలా కాదు నాన్న అంటే... ఎందుకు కాదు అంటాదు. ఎట్టకేలకు వాడు అలా మాట్లాడటానికి కారణమేమిటని బుజ్జగించి విషయాన్ని రాబడితే నాకు తెలిసిన నిజంతో అవాక్కయ్యా.
ఇంతకు విషయమేమిటంటే... ఇటీవల వచ్చిన సినిమాల్లోని హీరోలంతా అలాగే తమకు నచ్చిందే చెస్తున్నారట. ఆ విషయాలు నీకెలా తెలుసురా అంటే చివరకు టీవీ పెడితే చాలు ఆయా సినిమాల్లోని ట్రైలర్లలో కూడా అటువంటి సన్నివేశాలే సాక్షాత్కరిస్తున్నాయట. అవన్ని సినిమాలు జీవితంలో పనికి రావని చెపితే ఎందుకు పనికి రావని తిరిగి నన్నే ప్రశ్నిస్తాడు. మొన్నా మద్య ఓ హీరో గారు తన టీవీ ఇంటర్యూలో నేను బయట ఏఅ ఉంటానో సినిమాల్లో కూడా అలాగే జోవియల్ గా ఉంటాను అన్నాడట. దీంతో మావాడికి ఎలా నచ్చజెప్పలో అర్థంకాక తల పట్టుకోవాల్సి వచ్చింది. చివరకు నానిగాడిని కూర్చొబెట్టి ఓ గంట క్లాస్ ఇచ్చిన తర్వాతగాని వాడు మామూలు స్థితికి రాలేదు. దీని ద్వారా నాకు తెలిసిందేమిటంటే... పిల్లలను టీవీలకు, సినిమాలకు దూరంగా ఉంచటం ద్వారా మనం కూడా మన శాంతిగా ఉండవచ్చని. నిజం... ఇది ప్రతి ఇంట్లో ఏదో ఓ సందర్బంలో వెలుగు చూసేదే. కాని బయటపడం. నా వరకు వచ్చేంత వరకు నెనూ ఇంతేగా. అందుకు ఇప్పుడు నేను నిర్ణయించుకున్నదేమిటంటే... నేనింతే?. ఎక్కడంటే టీవీ, సినిమాల విషయంలో.

మేఘన గుండ్ల

మంచి ప్రార్థన...




మేఘన గుండ్ల

ఎన్నెన్నో అందాలు...






మేఘన గుండ్ల

"జీసస్" మంచి గొర్రెల కాపరి...





మేఘన గుండ్ల

కృష్ణం వందే జగద్గురుం...




మేఘన గుండ్ల

Saturday, August 23, 2008

సదా శరణం గచ్చామి...


ట్యాంక్ బండ్ (హైదరాబాద్)

ఇదిగిదిగో భధ్రాధ్రి...

(భధ్రాచల రామాలయం)

అందమైన ప్రేమ జంట..?


మహేష్, నమ్రత దంపతులు
సేకరణ : మేఘన గుండ్ల

చిరంజీవి (మరో 'తారా'జకీయం)

సినిమా వ్యక్తులు రాజకీయాలను ఏలటం ఆంద్రదేశానికి కొత్తేమీ కాదు. కానీ సముద్రంలో అలలుగా ఒక్కొసారి ఉవెత్తున ఎగిసి పడుతూ, తిరిగి వెనక్కి వెళుతూ తారాగనం రాజకీయాల్లో ఒడిదుడుకులను ఎదుర్కోవటమే గత పదేళ్ళుగా రుచించని విషయం. పక్కనే ఉన్న తమిళనాడును ఏలిన ఎంజీఆర్ నుండి మన రాష్ట్రాన్ని పాలించిన ఎన్ టీఆర్ వరకు రాజకీయల్లో తిరుగులేని నేతలుగా చెలామని అయ్యారు. వారి తర్వాత సినీ రచయుత కరుణానిధి, అనాటి తార జయలలితలు తమిళనాట ఇంకా తమ రాజకీయన్ని ఏలుతూనే ఉండగా తెలుగునాట మాత్రం తారలు బోల్తా పడ్డారు. కారణం. రాజకీయాల్లోకి వచ్చిన తారలు తమ వైఖరిని ప్రజలకు స్పష్టంగా చెప్పలేక పోవటమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో 25 సంవత్సరాల నట జీవితాన్ని చవిచూసి, తెలుగునాట మెగా స్టార్ గా అశేష అభిమానుల అదరాభి మానాలు పొదుతున్న చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం చేస్తుండటం మరోమారు తారల రాజకీయాలపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ తారల రాజకీయాలపై ఓ కధనం...

కొత్తశకం...

రాజకీయాలు సినీ తారల జీవితాలకు షరా మాములైనా తెలుగునాట రాజకీయాలను ఓ కుదుపు కుదిపిన ఘనత దివంగత ఎన్ టీఆర్ కే దక్కింది. ఆయన ద్వారానే ఆంద్ర రాష్టంలో సినీ తారల రాజకీయ రంగ ప్రవేశాలకు పెద్దపీట వేసింది. ఎన్ టీఆర్ కు ముందు 1967లోనే నటుడు కొంగర జగ్గయ్య కాంగ్రెస్ నుంచి ఒంగోలు పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి గెలుపొందిన చరిత్ర ఉంది. అంతే కాకుండా ఆత్రేయ, జి.వరలక్ష్మి, మిక్కిలినేని, తాఫీ దర్మారావు వంటి వారు కమ్యునిష్టు పార్టీకి ప్రచారం చేశారు. ఇక రాజకీయాల్లో రక్తకన్నీరుతో గుర్తింపు పొందిన నాగభూషణం ఏకంగా మంచి ఉపన్యాసకుడిగా గుర్తింపు పొందారు. వీరంతా రాజకీయాలకు సుపరిచితమే అయినా ఒక్కసారిగా తెలుగు రాజకీయాలను మలుపుతిప్పే ప్రక్షాళణ చేసింది ఎన్ టీ ఆరే. తెలుగు వారి ఆత్మ గౌరవం నినాదంతో ఎన్ టీఆర్ 1982 లో తెలుగుదేశం పార్టీని స్థాపించటం తో ఓ కొత్త రాజకీయ శకం ఆంద్రదేశంలో మొదలైంది.

ఎందరో...

ఎన్ టీఆర్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తారలెందరో ఉన్నారు. జమున, కృష్ణ, కృష్ణమ్రాజు, మోహన్ బాబు, శారద, సత్యనారాయణ, రామానాయుడు, సుబ్బిరామిరెడ్డి, హరికృష్ణ, కోట శ్రీనివాసరావు, జయప్రద, బాబుమోహన్, అశ్వనిదత్, మురళీమోహన్, ఏవీఎస్, దర్మవరపు సుబ్రమణ్యం, రోజా ఇలా గ్లామర్ నేతల జాబితా పెరుగుతూ పోయింది. ఇందులో కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కాగా ఏ పదవీ దక్కక వెనక్కు వచ్చిన వాళ్ళు ఉన్నారు.

దక్షిణాధిన...

తమిళనాట తెర రాజకీయాలు మనకంటే ముందే మొదలయ్యాయి. అక్కడ కాంగ్రేసేతర ముఖ్యమంత్రులంతా సినిమా నుంచి వచ్చిన వాళ్ళే. ద్రావిడ ముక్యమంత్రి అన్నదురై, కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత, జానకి రామచంద్రన్, శివజీ, రజినికాంత్, శరత్ కుమార్, విజయ్ కాంత్, మనోరమ, ఎసెస్ చంద్రన్ ఇలా తెర నుంచి వచ్చిన వారి సంఖ్య చాంతాడంత ఉంటుంది. కర్నాటకలో అంబరీష్ మంత్రి పదవినే చేపట్టగా, చంద్రు, అనంతనాగ్, సాయికుమార్, జయంతి తదితరులున్నారు. అయితే కేరళలో సినిమా రాజకీయాల చుట్టరికం మనంతగా బలపడలేదని చెప్పుకోవచ్చు. ఇక మన విషయానికి వస్తే నవ్వు, తలకట్టు, మీసకట్టు, వేషం, రోషం, తనదైన గంభీర కంఠస్వరంతో తెలుగు వారిచే జేజేలు అందుకుంది ఎన్ టీఆర్ ఒక్కరే. వెండితెరపై వెలుగొందుతూనే రాజకీలను మార్చాలనే తలంపుతో అన్ని వదులుకొని జనం మద్యకు వచ్చిన ఆయనకు పట్టం కట్టారు.

సినీ దేవుళ్ళు...

తమ అభిమాన తారలకు గుళ్ళు, హారతులు ఇచ్చే భారతీయ సమాజంలో ప్రేక్షకులకు తారలు నిజంగానే ఓ మోస్తారు దేవుళ్ళు. తార దర్శన భాగ్యమో, కరచాలనమో దొరికితేనే తమ జన్మ దన్యమనుకునే జనం సెంట్ మెంట్ నే పార్టీలు అవకాశవాదంగా వాడుకుంటూ వస్తున్నాయి. సినీ తారలొస్తే జనం ఎగబడతారనే ఆలోచనతోనే సినిమా వాళ్ళు పార్టీల్లో చేరి పదవులు చేపట్టున ఆయా పార్టీల సీనియర్లు సైతం మౌనంగా ఉంటారు. ప్రతి పార్టీలోను జనాకర్షణ కలిగిన నేతలు ఒకరొ ఇద్దరో ఉంటారు. అయితే ఎన్నికల సమయంలో వారు అన్ని ప్రాంతాలకు వెళ్ళటం కుదరదు. అందుకే జనం నొట్లో నానే సినీ గ్లామర్ ను తమ పార్టీ ప్రచారానికి ఉపయోగించుకోవడం నేడు సర్వ సాదరనంగా మారింది.

రంగప్రవేశం...

"గ్లామర్ ఒక్కటే ప్రజల అవసరాలను తీర్చలేదు. అదొక్కటే చూసి ప్రజలు మద్దతివ్వరు. కావలసింది చిత్తశుద్ది, నిజాయితీ" అని ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన సందర్బంలో ఎన్ టీఆర్ అన్నారు. అలా ప్రజలకు చిత్తశుద్దితో దగ్గరైతేనే తిరిగి వారిని గెలిపిస్తారన్నది తారల రాజకీయ జీవితాల్లో వాస్తవాన్ని చూపింది. రాజకీయాల్లోకి వచ్చిన తారల్లో అన్ని రకాల వాళ్ళున్నారు. కొదరు డబ్బు కోసమైతే, పదవుల కోసం, పాత చిక్కులను తప్పించుకోవటం కోసం, కొత్త పరిచయాల కోసం అవసరాన్ని బట్టి మరికొందరు ఉన్నారు. వీరే కాకుండా ఏదో తపన, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, వ్యవస్థను మార్చాలన్న సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చిన వారున్నారు. అయితే వీరు రాజకీయ వ్యవస్థను మార్చటంలో అశక్తులమని తెలుసుకుని అక్కడ ఇమడలేక గోడకు కొట్టిన బంతిలా వెనక్కు వచ్చేస్తారు. ఈ జబితాలో దేవానంద్, అమితాబ్ బచ్చన్ వంటి వారున్నారు.

చిత్తశుద్ది.. నిజాయితి...

"ఈ ప్రజాభిమానం దేవుడిచ్చిన వరం"అని ఎన్ టీఆర్ వందలసార్లు అనుంటారు. నిజమే ఆ గ్లామర్, ఆకర్శణ ఒక వరమే. రాజకీయ నాయకులు పాతికేళ్ళ ప్రజ జీవితంలో సాధించలేనిదాన్ని పాతికేళ్ళ హీరో అవలీలగా సొంతం చేసుకోగలడు. రంగుల లోకంలోనికి తీసుకెళ్ళే తారలంటే సామాన్యులకు ఎక్కడలేని అభిమానం. వారికి దూరంగా ఉన్నా మనవాడు అనే ఆత్మీయ భావన. ఆ అభిమానం కలకాలం తమ వెంట ఉండాలంటే అందరికి సాద్యం కాకపోవచ్చు. కాని ఎన్ టీఆర్ అన్నట్లు చిత్తశుద్ది, నిజాయితీ ఉంటే ప్రజాభిమానం ఎల్లప్పుడు వారి వెంటే. ఎన్ టీఆర్, ఎంజీఆర్ వంటి వారికి సాద్యమైంది. చరిత్రలో లిఖించబడింది. ఇప్పుడు చిరంజీవి రాజకీయ ప్రవేశం. సాద్యమైతే చరిత్ర పునరావృతమే ?.

సేకరణ : మేఘన గుండ్ల

నేత్ర దర్శనం...




నా కంటితో చూడు..

ఆహా... లోకం ఎంతందం

తెలుగు తెరపై కొత్త 'అందం'


నటి : శ్రద్దాదాస్